మెదక్ డిగ్రీ కళాశాల వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓపెన్ డిగ్రీ పరీక్షలు వ్రాయడానికి వెళ్తున్న యవకుడు దివ్య అనే యువతి చేతిని నరికివేశాడు. ఈ సంఘటన తెలుసుకున్న స్థానికులు పోలీసులకు, యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. యువతిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
దివ్య తల్లి కృష్ణవేణి సొంత గ్రామం అవుసులపల్లి కాగా హైదరాబాద్‌కు చెందిన కుమార్‌ను కృష్ణవేణి పెళ్లి చేసుకుని హైదరాబాదులోనే స్థిరపడ్డారు. గత ఆరు సంవత్సరాల క్రితం అవుసులపల్లి గ్రామానికి వచ్చి కృష్ణవేణి, దివ్య మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. కృష్ణవేణి భర్త కుమార్ హైదరాబాదులో పనిచేస్తూ నెలలో ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్తుంటాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.