యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన ఒకరి ఇంటికి బంధువులు వచ్చారు. దీంతో మర్యాద కోసం స్థానిక వైన్ షాపులోకి వెళ్లి ఆరు బీరు బాటిల్స్ కొనుగోలు చేశాడు. వాటిని ఇంటికి తీసుకువెళ్లి తాగేందుకు సిద్ధం కాగా, ఒక బీరు సీసా పూర్తిగా నాచుతో ఉంది. దీంతో ఆ బీరునను పట్టుకెళ్లి మద్యం షాపు కౌంటర్లో చూపించాడు. బీరు బాటిల్లో నాచు ఎలాా వచ్చిందని ప్రశ్నించాడు. ఈ బీరు తమ వద్ద తీసుకున్నట్లు గ్యారంటీ ఏంటని వైన్స్ నిర్వాహకులు ఎదురు తిరగడంతో కస్టమర్ షాక్ గురయ్యాడు. దీనిపై ఎక్సెజ్ అధికారులను వివరణ కోరగా, వారు కూడా ఇదే తరహాలో సమాధానం ఇచ్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.