దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..!

సైబర్ మోసాలు సామాన్యులను మాత్రమే కాదు.. ఇప్పుడు ఏకంగా దేవుడి పేరు, ఆలయ ప్రతిష్ఠను కూడా అడ్డు పెట్టుకుంటున్నాయి. సైబర్ కేటుగాళ్లు దేవుడి పేరు చెప్పి భక్తులనే టార్గెట్ చేస్తున్నారు. దేవాలయాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి.. ఆర్జిత సేవల బుకింగ్ పేరుతో ఆన్‌లైన్ మోసాలకు తెరలేపుతున్నారు. చివరికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి కూడా సైబర్ కూడా సైబర్ దాడి తప్పలేదు.

దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..!
Yadadri Temple Cyber Fraud

Edited By:

Updated on: Oct 06, 2026 | 7:20 PM

మహిమాన్విత స్వయంభూ యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం.. తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతోంది. తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా ఉన్న సంభోద్భవుడు.. యాదగిరి గుట్ట ప్రధాన ఆలయాన్నీ 1300 కోట్ల రూపాయలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పునర్ నిర్మించింది. దీంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఏకశిఖర వాసుడి సన్నిధికి రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు తాకిడి ఎక్కువైంది. ప్రస్తుతం రోజుకు సగటున 50 వేల మంది భక్తులు వస్తుండగా, పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతోంది.

యాదాద్రి పేరుతో నకిలీ సైట్లు! ..

యాదాద్రి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో కిటికీటలాడుతోంది. దీంతో చాలామంది భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం అధికారులు ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు ప్రైవేటు సంస్థలు, కేటుగాళ్లు..శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆర్జిత సేవ‌ల పేరిట ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. దేవుడి పేరు చెప్పి.. భక్తులనే టార్గెట్ చేస్తున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం, ఆర్జిత సేవలు, పూజలు, వసతి, విరాళాల పేరిట కొందరు సైబర్ కేటుగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దేవస్థానం అధికారిక లోగోలు, ‘YTD’, ‘Yadadri’, ‘Yadagirigutta’ వంటి పదాలతో అచ్చం అసలు వెబ్‌సైట్‌ను పోలిన డొమైన్లతో ప్రైవేట్ పోర్టళ్లను నడిపిస్తున్నారు.

*బయటపడిందిలా…

ఇటీవల ఓ భక్తుడు యాదగిరిగుట్ట స్వామివారి సేవల కోసం ఆన్ లైన్ లో ప్రైవేట్ పోర్టల్ ద్వారా రూ. 10,000 చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నాడు. తీరా ఆ టికెట్ తో యాదగిరిగుట్ట కొండపైకి చేరుకొని తనకు స్వామివారి సేవలు అందించాలని ఆలయ అధికారులను కోరాడు. ఆ టికెట్ ను పరిశీలించిన దేవస్థానం ఉద్యోగులు అది యాదగిరిగుట్ట అధికారిక టికెట్ కాదని, నకిలీదని తేల్చారు. బాధితుడి నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు స్వీకరించారు.

ఇవి కూడా చదవండి

అధికారుల సీరియస్ వార్నింగ్…

భక్తులను నిలువునా దోచుకుంటున్న అనధికారిక, ప్రైవేట్ వెబ్ సైట్లపై ఆలయ అధికారులు దృష్టి సారించారు. స్వామివారి ఆర్జిత సేవల పేరిట భక్తులను దోపిడీ చేస్తున్న ప్రైవేటు, వ్యక్తులు సంస్థల పట్ల ఆలయ అధికారులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నకిలీ వెబ్‌సైట్లు నిర్వహిస్తున్న సంస్థలకు లీగల్ నోటీసులు జారీ ఇవ్వడంతోపాటు, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు, ఐటీ విభాగం, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

భక్తులను అప్రమత్తం చేసిన ఆలయ అధికారులు..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి yadagiriguttatemple.telangana.gov.in మాత్రమే ఏకైక అధికారిక వెబ్‌సైట్ అని ఈవో భవానీశంకర్ తెలిపారు. ఆన్‌లైన్ సేవలు, విరాళాల కోసం కేవలం యాదగిరిగుట్ట అధికారిక వెబ్‌సైట్ మాత్రమే ఉపయోగించాలనీ, వాట్సాప్ లింకులు, సోషల్ మీడియా ప్రకటనలు, అనుమానాస్పద వెబ్‌సైట్లను నమ్మి డబ్బులు చెల్లించవద్దనీ ఆలయ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా మోసపూరిత వెబ్‌సైట్లను గుర్తిస్తే వెంటనే స్క్రీన్ షాట్లతో సహా ఆలయ అధికారులు, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలనీ కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us