Telangana: మాకు ఆ టీచరే కావాలి.. రోడ్డేక్కిన గ్రామస్తులు.. చివరికి ఎమ్మెల్యే చొరవతో..!

|

Nov 26, 2021 | 7:02 AM

Telangana: వికారాబాద్‌ మండలంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ బాబుకి ఆసక్తికర పరిస్థితి ఎదురైంది. గ్రామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేను ఆ గ్రామస్తులు అడిగిన కోరిక అవాక్కయ్యేలా చేసింది.

Telangana: మాకు ఆ టీచరే కావాలి.. రోడ్డేక్కిన గ్రామస్తులు.. చివరికి ఎమ్మెల్యే చొరవతో..!
Mla Anand Babu
Follow us on

Telangana: వికారాబాద్‌ మండలంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ బాబుకి ఆసక్తికర పరిస్థితి ఎదురైంది. గ్రామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేను ఆ గ్రామస్తులు అడిగిన కోరిక అవాక్కయ్యేలా చేసింది. అది విన్న ఎమ్మెల్యే సైతం ఆశ్చర్యపోయారు. అంతేకాదు.. వారి కోరికలో మంచి ఉండటంతో.. గ్రామస్తుల అడిగిన పనిని వెంటనే పూర్తి చేశారు. దాంతో గ్రామస్తులు, ఆ ఊరి పాఠశాల విద్యార్థులు సంతోషపడ్డారు. ఇంతకీ ఈ గ్రామస్తుల కోరిక ఎంటనే కదా మీ సందేహం…? అయితె తెలుసుకుందాం పదండి..

వికారబాద్‌ మండలంలోని ద్యాచారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శ్రీలత అనే మహిళా టీచర్‌ ఇటీవల మరో గ్రామానికి బదిలి అయ్యారు. గత 12 ఏళ్లుగా ఇదే గ్రామంలో ఎంతోమంది విద్యార్థులకు పాఠాలు భోదించిన శ్రీలత టీచర్‌ బదిలీని ఆ స్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు తట్టుకోలేకపోయారు. అందుకే శ్రీలత టీచర్ బదిలిని రద్దు చేయాలని వేడుకుంటూ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్ బాబుకు మొరపెట్టుకున్నారు. దాంతో స్పందించిన ఎమ్మెల్యే ఆనంద్‌ బాబు.. పిల్లలు, తల్లిదండ్రుల కోరిక మేరకు శ్రీలత టీచర్‌ను తిరిగి ద్యాచారం స్కూల్లోనే కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. దానికి గ్రామస్తులు, విద్యార్థులంతా కలిసి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

గత 12ఏళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నానని, ఇక్కడి విద్యార్థులు, స్కూల్‌ కోసం తాను ఎంతగానో కృషి చేశానని చెబుతున్నారు టీచర్‌ శ్రీలత. తన కోసం ఎమ్మెల్యేను రికమాండ్‌ చేసిన గ్రామస్తులు, విద్యార్థులుకు టీచర్‌ రుణపడి ఉంటానన్నారు.

Also read:

Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే..

Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..

Flashback: చీరకట్టులో అనసూయ.. రొమాంటిక్‌గా రెజీనా, ప్రభుదేవా.. ఆకట్టుకుంటోన్న ఫ్లాష్‌బ్యాక్‌ కొత్త పోస్టర్లు..