Viral Video: రైలు ప‌ట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వింత ఆకారం.. ఏంటాని చూడగా గుండె గుభేల్! వీడియో

|

Dec 18, 2024 | 5:58 PM

ఓ వ్యక్తి రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు.. రైలు పట్టాలపై అల్లంత దూరాన వింత ఆకారం అతడికి కనిపించింది. ఏంటాని చూసేందుకు ఇంకాస్త ముందుకు వెళ్లాడు. తీరా చూడగా భయంతో వెనక్కి కూడా చూడకుండా పరుగులు తీశాడు. అంతే చుట్టుపక్కల అంతా అలర్ట్ అయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది..

Viral Video: రైలు ప‌ట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వింత ఆకారం.. ఏంటాని చూడగా గుండె గుభేల్! వీడియో
Tiger Spotted At Railway Track
Follow us on

ఆసిఫాబాద్, డిసెంబర్‌ 18: తెలంగాణ‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్ద పులులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. గోదావ‌రి న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో పులుల సంచారం స్థానికులను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇలా కుమ్రం భీం ఆసిఫాబాద్, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ఆదిలాబాద్, ములుగు, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెద్ద పులులు యదేచ్ఛగా సంచ‌రిస్తున్నాయి. అడవులను వదిలి జనసంచారంలోకి ప్రవేశిస్తున్న ఈ పులుల జాడ తెలుసుకునేందుకు ఆయా జిల్లాల ప‌రిధిలోని అట‌వీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయినా కొన్ని చోట్ల పులులు జనావాసంలోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వ‌ద్ద మరోమారు పులి క‌ల‌క‌లం సృష్టించింది. ప‌ట్టప‌గ‌లే రైలు ప‌ట్టాల వద్ద పులి కనిపించింది. రైలు పట్టాలు దాటుతూ కనిపించిన పెద్ద పులిని ఓ వ్యక్తి ఫోన్‌ కెమెరాలో రికార్డు చేశాడు. ఈ వీడియోలో ప‌ట్టాలు దాటుతూ ఉన్న ఆ పులి అటుఇటు చూస్తూ చక్కా వెళ్లిపోయింది. అదే ప‌ట్టాలపై న‌డుచుకుంటూ వెళ్లున్న ఓ వ్యక్తి ఉన్నట్లుండి పట్టాలపై కనిపించిన పులిని చూసి ఉలిక్కి పడి పరుగు లంకించుకున్నాడు. ఎందురుగా కనిపించిన పులి ఆ వైపు నుంచి ఈ వైపుకు దాటుకుంటూ వెళ్లిపోయిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఇక నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వే స్టేష‌న్‌కు స‌మీపంలోనే పెద్ద పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పులి సంచారంపై స్థానికులు అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. రైల్వే పట్టాలపై కనిపించిన పులి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.