AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఛీ.. ఛీ.. ఏం మనుషులురా.. శవాలపై చిల్లరేరుకోవడం అంటే ఇదేనేమో.. గుండె నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లగా..

నిజామాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు చికిత్స పొందతూ మృతి చెందింది. అయితే వృద్దురాలి చనిపోయందనే బాధతో ఉన్న కుటుంబ సభ్యులకు మరో షాకింగ్ విషయం తెలిసిందే.. అదేటంటే ఆమె ఒంటిపై ఉన్న బంగారం మాయమైందని అది విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాకయ్యారు.

Watch: ఛీ.. ఛీ.. ఏం మనుషులురా.. శవాలపై చిల్లరేరుకోవడం అంటే ఇదేనేమో.. గుండె నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లగా..
Tg News
Diwakar P
| Edited By: |

Updated on: Nov 11, 2025 | 3:31 PM

Share

ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లిన వృద్ధురాలు మృతిచెందగా.. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు చోరీకి గురైన ఈ ఘటన నగరంలోని ప్రగతి ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ​బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ ఇంట్లో ఉన్న వృద్దురాలు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఆదివారం తెల్లవారుజామున నగరంలోని హైదరాబాద్​ రోడ్డు​లో ఉన్న ప్రముఖ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే గత రెండ్రోజులు అక్కడే చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మృతి చెందింది.

ఈ విషయాన్ని హాస్పిటల్‌కు సిబ్బంది వారి కుటుంబ సభ్యులక తెలియజేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు వచ్చిన చూడగా ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారం గొలుసు కనిపించలేదు. దీంతో గొలుసు చోరీకి గురైనట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందే గొలుసు చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధురాలు చనిపోయినప్పుడు ఒంటిపై బంగారు గొలుసు ఉందని, తాము బయటకు వెళ్లి వచ్చేలోపు అది మాయం అయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ సమయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా హాస్పిటల్‌కు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందికి విడిగా ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఉన్న సీసీ పుటేజ్ నిక్షిప్తం అయే డీవీఆర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంధువుల ఆరోపణలు

;

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..