Vijayashanthi: అది వాళ్లకే తెలియాలి.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

|

Aug 18, 2022 | 3:33 PM

గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ తీరును ఎండగట్టి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న విజయశాంతి మొదటిసారిగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి

Vijayashanthi: అది వాళ్లకే తెలియాలి.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
Vijayashanthi
Follow us on

Vijayashanthi comments : ఆమె ఏ పార్టీలో ఉన్నా.. ఆమె రూటే సపరేటు.. ఎవరూ ఏమనుకున్నా ఐ డోంట్ కేర్.. అంటూ నిర్మోహమాటంగా మాట్లాడుతారు.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోనే కాకుండా తాజాగా.. బీజేపీలోనూ విజయశాంతి అసంతృప్తి రాగం వినిపించారు. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ తీరును ఎండగట్టి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న విజయశాంతి మొదటిసారిగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందంటూ పేర్కొన్నారు. తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగాలంటూ విజయశాంతి పేర్కొన్నారు.

‘‘పార్టీ రాష్ట్ర నాయకత్వం నన్ను నిశ్శబ్దంలో ఉంచింది.. పార్టీలో మాట్లాడటానికి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగండి.. నేను అసంతృప్తిగా ఉన్నానో లేనో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోండి.. ఈ రోజు సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడుదాం అనుకున్నా.. కానీ లక్ష్మణ్ వచ్చి మాట్లాడారు వెళ్లిపోయారు.. నాకు ఏమీ అర్ధం కాలేదు.. నా సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్ కే తెలియాలి.. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది’’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలం.. ఇవ్వకుండా చేయమంటే ఏం చేయగలం అంటూ విజయశాంతి పేర్కొన్నారు. తన పాత్ర ఎప్పుడూ టాప్‌ పాత్రేనని.. రాములమ్మగా, ఉద్యమకారిణిగా అందరి హృదయాల్లో ఉన్నానని.. తాను పార్లమెంట్‌లో కొట్లాడిన మనిషినంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..