AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. సగం ధరకే నెల ప్రయాణం.. ప్రతి సండే ఫ్రీ జర్నీ!

ప్రయాణికుల రోజువారీ బస్సు ప్రయాణాన్ని మరింత పొదుపుగా.. సులభంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రస్తుతం అందిస్తున్న నెలవారీ సీజన్ టికెట్ (MST) పథకం కింద 09 అదనపు సౌకర్యాలు, ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఈ సవరించిన నిబంధనలు శనివారం14 నవంబర్ 2026 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఆర్టీసీ తాజా నిర్ణయం విద్యార్థులు, ఉద్యోగులు, నిత్య ప్రయాణికులకు ఆర్థికంగా బిగ్‌ రిలీఫ్ ఇవ్వనుంది

TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. సగం ధరకే నెల ప్రయాణం.. ప్రతి సండే ఫ్రీ జర్నీ!
Free City Bus Rides On SundaysImage Credit source: AI IMage
Anand T
|

Updated on: Nov 13, 2026 | 7:23 PM

Share

ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న మంత్‌లీ సీజన్ టిటెక్‌ డిస్టెన్స్‌ను పూర్తిగా తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నిర్దేశించిన రూట్, ఛార్జీల నిబంధనలకు లోబడి, ప్రయాణికులు ఇకపై ఎలాంటి దూర పరిమితి లేకుండా నెలవారీ సీజన్ టికెట్లను పొందవచ్చు. పాస్ ధరలను మరింత తగ్గించే క్రమంలో టోల్ ప్లాజా ఛార్జీలను ప్రస్తుతం ఉన్న 25 రోజులకు బదులుగా కేవలం 20 రోజులకు మాత్రమే లెక్కించనున్నారు. అంతేకాకుండా, సాధారణ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ ఎంపికను అందించేందుకు డీలక్స్ నెలవారీ సీజన్ టికెట్లను టీజీఎస్ ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. ఈ పాస్‌లు ఇ-డీలక్స్ సర్వీసులలో కూడా చెల్లుబాటు అవుతాయని తెలిపింది.

ఇక నెలవారీ సీజన్ టికెట్ హోల్డర్లకు ప్రత్యేక ప్రయోజనంగా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో నడిచే అన్ని కేటగిరీల సిటీ బస్సు సర్వీసులలో ఆదివారాల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పించారు. అయితే, ఈ సౌకర్యం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌ పరిధిలోని పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు, ఇతర ప్రభుత్వ సెలవు దినాలకు వర్తించదని ఆర్టీసీ పేర్కొంది.

అదేవిధంగా ప్రయాణ సౌలభ్యం కోసం కాంబి టికెట్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కింద ప్రతి ప్రయాణానికి అదనంగా 20 రూపాయలు చెల్లించి కాంబి టికెట్ తీసుకోవచ్చు. పల్లెవెలుగు మంత్లీ సీజన్ టికెట్ హోల్డర్స్, ఎక్స్‌ప్రెస్ ఇ-ఎక్స్‌ప్రెస్ బస్సులలోనూ, అలాగే ఎక్స్‌ప్రెస్ ఎంఎస్‌టీ హోల్డర్లు డీలక్స్, ఇ-డీలక్స్ బస్సులలోనూ ప్రయాణించవచ్చు. అయితే పల్లెవెలుగు పాస్‌దారులకు డీలక్స్ లేదా ఇ-డీలక్స్ బస్సులలో అనుమతి ఉండదు.

ఇవి కూడా చదవండి

అదనంగా, తమకు నిర్దేశించిన రూట్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని ఇతర మార్గాల్లో ప్రయాణించే సీజన్ టికెట్ హోల్డర్లకు సూపర్ లగ్జరీ, అంతకంటే పైస్థాయి కేటగిరీ బస్సుల బేసిక్ టికెట్ ఛార్జీపై 10 శాతం ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. దీర్ఘకాలిక పాస్‌లు తీసుకునే వారికి ప్రోత్సాహకంగా, రెండు నెలల సీజన్ టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా అదనంగా 5 రోజుల వ్యాలిడిటీని, మూడు నెలల సీజన్ టికెట్ తీసుకునే వారికి అదనంగా 10 రోజుల వ్యాలిడిటీని సంస్థ కల్పిస్తోంది.

అన్నింటికంటే ముఖ్యంగా మహిళా ప్రయాణికులలో సీజన్ టికెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీని ప్రవేశపెట్టింది. దీని కింద టోల్ ఛార్జీలతో సహా సీజన్ టికెట్ ఛార్జీలను ప్రస్తుతం ఉన్న 20 రోజులకు బదులుగా కేవలం 15 రోజులకు మాత్రమే లెక్కించనుండటంతో మహిళలకు భారీగా డబ్బు ఆదా కానుంది.

టీజీఎస్ ఆర్టీసీతో ప్రయాణించండి – మరింత ఆదా చేయండి అనే నినాదంతో తీసుకొచ్చిన ఈ నూతన సౌకర్యాలను విద్యార్థులు, ఉద్యోగులు, నిత్య ప్రయాణికులందరూ గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో