మనదేశంలో అభిమాన సినీ తారలు, రాజకీయ నేతలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నేతలు, నటుల బర్త్ డే ల సందర్భంగా అభిమానులు చేసే హడావుడి మామూలుగా ఉండదు. అభిమానులు వారిని తమ ఇంట్లో మనిషికన్నా ఎక్కువగా భావిస్తారు. గుడి కట్టి పూజలు చేస్తారు. దేశంలో ఎంతోమంది రాజకీయ నేతలు, సినీ తారలకు అభిమానులు గుడులు కట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. తాజాగా, ఓ అభిమాని సీఎం రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని నిర్ణయించాడు. ఆ వివరాలు ఏంటో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
రేవంత్ రెడ్డి రాజకీయాల్లో స్వశక్తితో ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న పథకాలతో ప్రజాదరణ పొందారు. రాష్ట్రంలో ఏ ప్రజా నేత సంపాదించుకోని ఓ అరుదైన అభిమానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సంపాదించుకున్నారు. తాజాగా సీఎం రేవంత్ కు ఏకంగా గుడి కట్టెందుకు రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం ముందుకు వచ్చింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలకు చెందిన మేడి సంతోష్.. రాష్ట్ర రెడ్డి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.
ఈ క్రమంలో తన అభిమాన నేత సీఎం రేవంత్ రెడ్డికి తన స్వగ్రామంలో గుడి కట్టాలని నిర్ణయించాడు. ఇందుకోసం ఈనెల 19వ తేదీన వనిపాకలలో కాంగ్రెస్ నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డిలతో భూమి పూజ చేయనున్నట్లు సంతోష్ రెడ్డి తెలిపారు. పేదల పెన్నిధిగా సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో దేవుడిగా మారుతున్నారని, అందుకే తాను సీఎం రేవంత్ రెడ్డికి గుడి గుడి కట్టాలని భావించినట్లు ఆయన చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో గుడి కట్టడం ఇదే తొలిసారి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..