Pochampally Saree: ఫ్రాన్స్‌ అధ్యక్షుడి సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి.. దీని ప్రత్యేకత ఏంటంటే..

|

Jul 15, 2023 | 9:02 AM

భారత ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ భార్య బ్రిగిట్టే మాక్రాన్‌కు ఈ పోచంపల్లి ఇకత్‌ చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ చీరను మోడీ శాండల్‌వుడ్ బాక్స్‌లో అందించారు. మరి ప్రధాని అందించిన ఇకత్‌పై మరింత ప్రాధాన్యత..

Pochampally Saree: ఫ్రాన్స్‌ అధ్యక్షుడి సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి.. దీని ప్రత్యేకత ఏంటంటే..
Pochampally Saree
Follow us on

భారత ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ భార్య బ్రిగిట్టే మాక్రాన్‌కు ఈ పోచంపల్లి ఇకత్‌ చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ చీరను మోడీ శాండల్‌వుడ్ బాక్స్‌లో అందించారు. మరి ప్రధాని అందించిన ఇకత్‌పై మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఇకత్‌ చీర ఎంతో ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలు చీరలకు ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. నల్గొండ జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లి చీరల విషయంలో పేరొందుతోంది. మహిళలను ఆకట్టుకునే విధంగా చీరలు ఇక్కడే తయారవుతాయి. ఇక్కడి చీరలకు రంగులువేసే విధానం కొనసాగుతోంది. ఈ విధానాన్నే రెసిస్ట్ డైయింగ్ అని అంటుంటారు. ఇక్కడ చీరలకు ఉపయోగించే దారాలకే రంగులు అద్ది డిజైన్‌లను వేస్తుంటారు.

అయితే ఈ రెసిస్ట్‌ డైయింగ్‌‌ అనేది వరల్డ్‌ వైజ్‌గా పురాతన విధానాల్లో ఒకటిగా చెప్పుకొంటారు. ఈ చీరలకు తయారు చేసే విధానాల్లో ఫాబ్రిక్‌ నమూనాల్లో ఒకటి ఈజిఫ్ట్‌కు చెందినదిగా చెబుతున్నారు. మమ్మీలను వెలికితీసే క్రమంలో నార పట్టీలను గుర్తించారు. ఆసియాలో, చైనా ఈ విధానం ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. దీనిని రాజవంశంలో అధికంగా వినియోగించారని చెబుతుంటారు. ఈ పట్టు మార్గం ద్వారా ఈ విధానాన్ని భారత్‌కు పరిచయం చేశారు. అయితే ఈ పోచంపల్లి చీరలు 1800 కాలంలో ప్రాచూర్యం పొందాయని చరిత్రకారులు చెబుతున్నారు.

అయితే ఇకత్‌ చీర అనేగానే ముందుగా గుర్తుకు వచ్చేది పోచంపల్లి. అయితే మామూలుగా బట్టను నేసిన తర్వాత రంగులను అద్ది డిజైన్‌ను రూపొందిస్తారు వస్త్రాకారులు. టై అండ్‌ డై టెక్నిక్‌ ద్వారా దారాలకే రంగులను అద్ది వాటితోనే డిజైన్‌ను రూపొందించి నేయడమే ఇకత్‌ చీర శైలి. ఈ పోచంపల్లి చీరలను తయారు చేసే హస్తకళాకారులు ఏపీలోని దాదాపు 80కిపైగా గ్రామాల వారు పోచంపల్లిలోని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ చీరల తయారీ శతాబ్దాల కిందటి నుంచే కొనసాగుతోంది. ఈ చీరల తయారీలో పాల్గొనే కుటుంబాలతో ఈ ఏరియాను సిల్క్‌ సిటీగా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ చీరలను ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తారు. ఈ బట్టల తయారీలో దారాలకు ముందుగా రంగులు అద్ది తర్వాత తయారు చేసేందుకు మగ్గాన్ని వినియోగిస్తారు. ఈ బట్టల తయారీలో బాటిక్‌ అనేది ఒక సంప్రదాయ పద్దతి. ఈ చీరలపై చుక్కలు, రేఖలు వేసి కాపర్‌ స్టాంప్‌ సాయంతో ప్రింటింగ్‌ వేస్తారు. ఇక్కడ చీరలను తయారు చేయడమే కాకుండా సల్వార్లు, షూట్స్‌, అనార్కలీ, లెహంగాలు వంటి వివిధ రకాల భారతీయ సంప్రాదాయ వస్త్రాలను సైతం తయారు చేస్తారు. ఇక 2005 సంవత్సరంలో పోచంపల్లి జియో గ్రాఫికల్‌ ఇండికేటర్‌ సైతం లభించింది. ఇది చీరల నాణ్యతను సూచిస్తుంది. ఇకపోతే ఈ పోచంపల్లి సారీలను ఐశ్వర్యరాయ్‌ సైతం తన వివాహం రోజున ధరించారు కూడా. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ పోచంపల్లి చీరలను ధరించిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పాలి. అంతేకాకుండా ఎయిరిండియా హోస్టెస్‌ కూడా ఈ పోచంపల్లి చీరలను ధరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి