Earning from Garbage: చెత్త అనగానే చాలా మంది మొహం అదోలా పెడతారు. కానీ ఆ చెత్తే.. కనక వర్షం కురిపిస్తే. అవునండి బాబూ.. ఎందకూ పనికి రాని చెత్తతోనే ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చు. అన్నింటికి మించి మనకు అవసరమైన డబ్బును సంపాదించవచ్చు. కేవలం ఇంటి వ్యర్థాలతోనే రూ. 70వేలకు పైగా సంపాదించవచ్చు. తెలంగాణలోని ఒక గ్రామంలో అలాగే చేస్తున్నారు. గ్రామాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. అదెలెగంటారా? అయితే అసలు కథ ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలోని హరిదాస్‌పూర్ గ్రామంలో చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. అంతేకాదు.. వాతావరణానికి మేలు చేస్తున్నారు. ఈ గ్రామ ప్రజలు తమ గ్రామం వెలుపల డంపింగ్ యార్డ్‌ని నిర్మించారు. అక్కడ తడి, పొడి చెత్తగా వేరు చేశారు. వాటి నుంచి రీ సైక్లింగ్ చేయగలిగే వ్యర్థాలను తీసివేస్తారు. పనికిరాని చెత్తను కాల్చివేస్తారు. అలా కాల్చిన తరువాత వచ్చే బూడిదను మళ్లీ ఉపయోగిస్తారు. ఇక తడి వ్యర్థాలను కుళ్లబెడతారు. అలా కంపోస్ట్ ఎరువును తయారు చేస్తారు. కంపోస్ట్ ఎరువును రైతులకు ఎక్స్‌పోర్ట్ చేస్తారు. తద్వారా ఆ గ్రామ పంచాయతీ రూ. 70వేలు సంపాదిస్తోంది. 2020 జులై నుంచి ఈ కంపోస్ట్ అమ్మడం ప్రారంభించారు. గ్రామల్లో కంపోస్ట్ ఎరువుకు మంచి డిమాండ్ ఉందని గ్రామ సర్పంచ్ కసల మల్లారెడ్డి తెలిపారు. ఈ ఎరువు పంపిణీ కోసం ట్రాక్టర్‌ను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు.
ఈ కంపోస్ట్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు సర్పంచ్ కసల మల్లారెడ్డి తెలిపారు. గ్రామంలో 32 సిసిటివి కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, 20 స్పీకర్లు ఉన్నాయన్నారు. సిసి టివి పర్యవేక్షణ వ్యవస్థ పంచాయతీ కార్యాలయంలోని సర్పంచ్ గదిలో ఉందన్నారు. కార్యాలయంలో పనిచేసేటప్పుడు గ్రామంలో జరుగుతున్న సంఘటనలను ట్రాక్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు. ఇక గ్రామానికి జి +1 మోడల్‌లో కొత్త పంచాయతీ భవనం కూడా నిర్మిస్తున్నామని, ఈ భవనం మరికొన్ని నెలల్లో సిద్ధమవుతుందని చెప్పారు. 150 చదరపు గజాలలో ఈ భవంతిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ భవంతిలో మహిళా సంఘాలు తమ సమావేశాలను నిర్వహించడానికి ప్రత్యేక గదిని కేటాయించడం జరిగిందన్నారు.
గ్రామంలో త్వరలోనే 40 కెవి సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ మల్లారెడ్డి తెలిపారు. గ్రామ అవసరాలు 27 కెవి మాత్రమే కాగా, మిగిలినవి గ్రిడ్‌కు సరఫరా చేయబడతాయన్నారు. అభివృద్ధి చెందుతున్న ఇతర ప్రాజెక్టులలో క్రీడా కార్యకలాపాల కోసం పాఠశాల ప్రక్కనే నాలుగు ఎకరాల ఆట స్థలం ఉందన్నారు. తాము గ్రామ స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకు గ్రామంలోని యువత సహకారం ఉందన్నారు. తమ గ్రామంలో అర్హత కలిగిన అమ్మాయిలందరికీ సుకన్య సమృణి యోజన (ఎస్‌ఎస్‌వై) ఖాతాలను తెరవడం ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఆడపిల్లలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.
Also read:
Summer Effect: ఇవి మామూలు కోతులు కాదండోయ్.. భక్తుల కోసం ఏర్పాటు చేస్తే వానర సేన వచ్చి ఏం చేసిందంటే..