Telangana: పోలీస్ నూతన లీవ్ మాన్యువల్‌ అంటే ఏమిటి? ఎందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి?

| Edited By: Velpula Bharath Rao

Oct 21, 2024 | 12:23 PM

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ నూతన లీవ్ మాన్యువల్‌ను రూపొందించింది. ఈ నూతన లీవ్ మాన్యువల్ నవంబర్ ఒకటో తేదీ నుండి అమల్లోకి రానుంది. ఈ మ్యాన్యువల్ ను నవంబర్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి తీసుకొస్తోంది. పోలీస్ నూతన లీవ్ మాన్యువల్‌ అంటే ఏమిటి? ఎందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి?

Telangana: పోలీస్ నూతన లీవ్ మాన్యువల్‌ అంటే ఏమిటి? ఎందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి?
Special Police New Leave Ma
Follow us on

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ నూతన లీవ్ మాన్యువల్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ మాన్యువల్‌పై పోలీస్ కుటుంబాలు మండిపడుతున్నాయి. ఈ నూతన లీవ్ మాన్యువల్ నవంబర్ ఒకటో తేదీ నుండి అమల్లోకి రానుంది. ఈ మ్యాన్యువల్ ను నవంబర్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి తీసుకొస్తోంది. తాజా నిబంధనలపై కానిస్టేబుళ్ల కుటుంబాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నల్లగొండ సమీపంలోని అన్నెపర్తి 12వ బెటాలియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుగుతుండగా బయట పోలీసుల కుటుంబసభ్యులు ధర్నా నిర్వహించారు.. దీంతో హైవేపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నూతన లీవ్ మాన్యువల్.. బ్రిటిష్ కాలంనాటి చట్టాలను సవరించాలని వారు డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 13 టీఎస్ఎస్పీ బెటాలియన్లు ఉన్నాయి. దాదాపు 8 వేల మంది పోలీసులు వివిధ ర్యాంకుల్లో పని చేస్తున్నారు. బెటాలియన్లలోని ప్రతి 12 మందిని ఒక ప్లటూన్ లేదా సెక్షన్ అని పిలుస్తారు. వీరిలో నలుగురు హెడ్ క్వార్టర్స్‌కు అందుబాటులో ఉంటారు. మిగిలిన 8 మందికి ఈ లీవ్ మాన్యువల్ వర్తిస్తుంది. ఒకరు సెలవు తీసుకుంటే ఏడుగురు కచ్చితంగా విధుల్లో ఉండాలి. ఈ ఏడుగురు ఒకరి తర్వాత మరొకరు నాలుగు రోజుల చొప్పున సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 నుంచి 7వ కానిస్టేబుల్ వరకు నాలుగు రోజుల చొప్పున లీవు తీసుకున్నాక 8వ కానిస్టేబులు అవకాశం వస్తుందన్నమాట. అంటే 28 రోజుల డ్యూటీ తర్వాత 4 రోజుల సెలవు దొరుకుతుందన్నమాట. ఒక వేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెడితే ఈ క్రమం దెబ్బతిని తదుపరి వ్యక్తి తీసుకోవాల్సిన సెలవు మరింత ఆలస్యం అవుతుంది. 2012 వరకు ఇలాంటి నిబంధనలే ఉండేవి. అయితే 2012 ఆగస్టు 5వ తేదీన తమ భర్తలు ఇంటికి రావడం లేదంటూ కొండాపూర్
బెటాలియన్ ఎదుట కానిస్టేబుళ్ల భార్యాపిల్లలు ధర్నా నిర్వహించారు. దీంతో కానిస్టేబుళ్లకు లీవుల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాన్యువల్లో మార్పులు చేసి ఒకసారి ఒక్కరిని కాకుండా ముగ్గురికి అవకాశం ఇవ్వడం ప్రారంభించారు. ఫలితంగా ప్రతి నెలా రెండుసార్లు అంటే 15 రోజులకు ఒకసారి ఇంట్లో వారిని చూసే అవకాశం ఉండేది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి