Smart Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులో మీ పేరు లేదా.. టెన్షనొద్దు.. ఫోన్‌లోనే ఈజీగా ఇలా సరిచేసి, డౌన్‌లోడ్ చేసుకోండి
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త స్మా్ర్ట్ రేషన్ కార్డులను అందిస్తున్న విషయం అందిరికీ తెలిసిందే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుఖానాల్లో వీటిని ప్రభుత్వం ఇప్పటికే దాదాపుయ 90శాతం లబ్ధిదారులకు పంపిణీ చేసింది. అయితే కొందరి స్మార్టు కార్డులో వివరాలు తప్పుగా వచ్చాని.. కంగారు పడుతున్నారు. కానీ మీరు ఎలాంటి ఆఫీస్‌ల చుట్టూ తిరగకుండా.. ఇంట్లో కూర్చొనే ఆ వివరాలు సరిచేసి.. కొత్త స్మార్ట్ రేషన్ కార్డును మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.అదెలానో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

తెలంగాణలో ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు.. దీంతో కొత్తగా వివాహాలు చేసుకొని కొత్త ఫ్యామిలీలు ఏర్పడిన వారికి రేషన్ కార్డులు లేక పథకాలు పొందడం కాస్త ఇబ్బందిగా మారిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అందరికీ తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. అయితే తాజాగా కేవలం అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు పొందాలని.. రేషన్ దుఖాకాల్లో దళారుల దోపిడి ఉండకూడదనే ఉద్దేశంతో.. ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తోంది.
అయితే ఇప్పటికే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మొదలు పెట్టిన ప్రభుత్వం.. దాదాపు అర్హులైన 90శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసింది. అయితే రేషన్ కార్డులో కుటుంబ పెద్ద పేరు కరెక్ట్‌గా ఉండి.. మిగతా వారి పేర్లు తప్పుగా వచ్చాయని కొందరు కంగారు పడుతున్నారు..కానీ టెన్షన్ పడొద్దు.. మీరు ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండా.. మీ మొబైల్‌లోనే తప్పులను కరెక్ట్ చేసుకొని.. రేషన్ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అవును అర్హులైన లబ్ధిదారులు T-Ration యాప్‌లో తమ వివరాలు ఎంటర్ చేసి.. మోబైల్‌లోనే స్మార్ట్ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా వెళ్లినప్పుడూ.. దాన్ని జిరాక్స్ తీసి చూపిస్తే సరిపోతుంది. కాబట్టి ఫోన్‌లో స్మార్ట్ రేషన్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం.
మొబైల్‌లో స్మార్ట్ రేషన్ కార్డు డౌన్‌లోడ్ చేయడం ఎలా?
- మొదటగా మీ మొబైల్లోని Google Play Store నుండి T-Ration యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి.. వచ్చిన ఓటీపీతో యాప్‌లో లాగిన్ అవ్వండి
- తర్వాత మీకు హోమ్‌స్క్రీన్‌లో Scan Smart RC ఆప్షన్‌ను కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేసి..
- మీ వద్ద ఉన్న ఫిజికల్ కార్డుపై కనిపించే బార్‌కోడ్ కోడ్‌ను మీ ఫోన్‌లోని స్కానర్‌తో స్కాన్ చేయండి.
- ఇప్పుడు అక్కడ Digital verification of smart card కనిపిస్తుంది.
- మీ వివరాలు అన్ని కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకొని.. తప్పులు ఉంటే సరిచేసి సబ్‌మిట్ చేయండి.
- తర్వాత పైన ఉన్న డౌన్‌లోడ్ ఐకాన్‌పై క్లిక్ చేసి కార్డును PDF రూపంలో స్మార్ట్ రేషన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,
