Telangana: పాలకూట విషం తమ ప్రాణాలను తోడేస్తుండంటున్న గ్రామస్తులు.. కంపెనీ స్పందన ఏమిటంటే..

|

Jan 08, 2025 | 9:16 PM

పాలు ఆరోగ్యకరమే.మరి పాల కంపెనీ? డెయిరీ ఫామ్‌ తమ పాలిట డేంజర్‌గా మారిందంటున్నారు కరీంనగర్‌లోని పలు కాలనీ వాసులు. కరీంనగర్‌ డెయిరీ కాలుష్యం తమ బతుకుల్ని కాటేస్తోందని ఆందోళనలు చేపట్టారు. అసలేం జరుగుతోంది. కాలనీవాసుల కష్టాలేంటి? కంపెనీ వివరణ ఏంటీ? తెలుసుకుందాం..

Telangana: పాలకూట విషం తమ ప్రాణాలను తోడేస్తుండంటున్న గ్రామస్తులు.. కంపెనీ స్పందన ఏమిటంటే..
Residents Protest
Follow us on
ఉద్యమాలకు కేరాఫ్‌గా ఖ్యాతికెక్కిన కరీంనగర్‌లో తాజాగా మరో ఉద్యమం తెరపైకి వచ్చింది. పాలకూట విషం నుంచి తమ ప్రాణాలను కాపాడాలంటూ ఆందోళన బాటపట్టారు కాలనీవాసులు. కరీంనగర్‌ డెయిరీని తమ ఏరియా నుంచి తీసేయాలని కరీంనగర్‌ డెయిరీ ని తమ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. పాల కంపెనీ తమ ప్రాణాలను తోడేస్తుందని.. డెయిరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల కంటి నిండ నిద్దర ఉండడంలేదు.. కనీసం నీళ్లు కూడా తాగలేని దుస్థితి ఏర్పడింది.. పాల కంపెనీ వల్ల  గాలికాలుష్యం.. నీటికాలుష్యంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని గొల్లుమంటున్నారు స్థానికులు.
పద్మానగర్, రాంనగర్ ఏరియాలో కరీంనగర్ డెయిరీ ద్వారా పాల ఉత్పత్తి జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి సేకరించిన పాలను ప్యాకింగ్ చేసి సరఫరా చేస్తుంటారు. పాలను నిల్వచేయడం, ప్యాకెట్ తయ్యారు చేసే క్రమంలో కాలుష్యం వెదజల్లుతుంది. అంతేకాకుండా ఆ వ్యర్థ పదార్థాలను ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండానే బయటికి విడుదల చేస్తున్నారనేది స్థానికుల ఆవేదన. ఆరోపణ. డెయిరీకి ఐదు కిలోమీటర్ల వరకు భూగర్భ జాలాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయంటున్నారు.
ఇక్కడ నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తే 3000 పైగా TDS వస్తుంది. అలాంటి నీటిని సేవిస్తే వారం రోజులలో మంచం ఎక్కాల్సిందే…ఈ కలుషిత నీరు కారణంగా ప్యూరిఫైడ్ మిషన్ కూడా పనిచేయడం లేదు. గత్యంతరం లేక బోరు నీళ్లు వాడితే గేట్లు ఇలా తప్పు పట్టిపోతున్నాయని వాపోయారు.
ముఖ్యంగా రాంనగర్, పద్మానగర్ వాసులు బోరు నీళ్లు వాడాలంటే  భయపడుతున్నారు. మున్సిపల్‌ నీటిపైనే ఆధారపడుతున్నారు. ఇక్కడ నీటి కాలుష్యం.. గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు..చర్య వ్యాధులు వస్తున్నాయంటున్నారు. ఈ కాలనీలో ఇటీవలే ముగ్గురికి క్యాన్సర్‌ సోకడానికి కారణం.. ఇక్కడి కాలుష్యమేనంటున్నారు. తాము బతకాలంటే ఇక్కడి నుంచి ఆ డెయిరీని తీసేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులకు ఎన్నో ఫిర్యాదులు చేశారు. చివరకు ధర్నాలు చేపట్టారిలా.
ఐతే కాలనీవాసుల ఆందోళనలపై స్పందించింది కరీంనగర్‌ డెయిరీ యాజమాన్యం. నీటి కాలుష్యానికి తమ డెయిరీకి ఎలాంటి సంబంధమే లేదన్నారు కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌. డెయిరీ కాలుష్యం వల్ల తమ బతుకులు చిధ్రమవుతున్నాయంటున్నారు స్థానికులు. ఆరోపణలతో కరీంనగర్‌ డెయిరీ ప్రతిష్టను మసక బార్చవద్దంటోంది మేనేజ్‌మెంట్‌. మరి కాలనీవాసులు సమస్యల పరిష్కారానికి దారేది?.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..