Telangana Rain Alert: బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్‌ సిగ్నల్

తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన చేసింది. మరో గంటా.. రెండు గంటల్లో పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టబోతోందని హెచ్చరిస్తోంది. అంతేకాదు.. 90కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వార్నింగ్‌ ఇస్తోంది. జనాలు అత్యవసరం అయితే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

Telangana Rain Alert: బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్‌ సిగ్నల్
Telangana Rain Alert

Updated on: Jun 13, 2026 | 4:42 PM

తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ మరోసారి కీలక హెచ్చరికాలు జారీ చేసింది. రాబోయే రెండు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంతో పాటు గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అండ్‌ ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ చేసింది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్‌లో నాన్‌స్టాప్‌ హెవీ రెయిన్‌ పడుబోతోందని చెప్తోంది.

ఏ జిల్లాలకు ఏ అలర్ట్ జారీ చేసిందో చూడండి.

రెడ్‌ అలర్ట్: ఇక సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. ఈ మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఆరెంజ్ అలర్ట్: ఇక మెదక్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని స్పష్టం చేసింది.

ఎల్లో అలెర్ట్‌: వికారాబాద్‌, నారాయణపేట్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, జనగామ, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసి వాతావరణ శాఖ ఈ జిల్లాల్లో పలు చోట్ల ఊదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

దక్షిణ తెలంగాణలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళే కాదు ఆది, సోమ వారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచింది. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని.. అత్యవసరం అయితే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us