Telangana Forest Officers: ఆందోళనలో అటవీశాఖ ఉద్యోగులు.. ఆయుధాలు ఇస్తేనే డ్యూటీకి వస్తామంటూ అల్టీమేటం..

ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారి దారుణ హత్య.. ఆ డిపార్ట్ ఉద్యోగులందరిపై ప్రభావం చూపింది. ఆ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు అధికారులు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నో సర్వే అంటూ ..

Telangana Forest Officers: ఆందోళనలో అటవీశాఖ ఉద్యోగులు.. ఆయుధాలు ఇస్తేనే డ్యూటీకి వస్తామంటూ అల్టీమేటం..
Forest Officers Protest
Follow us

|

Updated on: Nov 26, 2022 | 1:18 PM

ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారి దారుణ హత్య.. ఆ డిపార్ట్ ఉద్యోగులందరిపై ప్రభావం చూపింది. ఆ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు అధికారులు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నో సర్వే అంటూ భీష్మించుకు కూర్చుకున్నారు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారులు. తమ సమ్యస్యలను పరిష్కరిస్తేనే పోడు సర్వే చేస్తామని తేల్చిచెప్పారు. అంతేకాదు.. ఇలాంటి దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలు కావాలని, ఆయుధాలు ఇస్తేనే డ్యూటీకి వస్తామంటూ ఆందోళనకు దిగారు.

ఇవాళ్టి నుంచి పోడు సర్వేకు బ్రే ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు సాగు సర్వేకు బ్రేక్ పడింది. సమస్యల పరిష్కరించే వరకు పోడు సర్వే బహిష్కరించాలని అటవీ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. నేడు ఖమ్మంలో అటవీశాఖ ఉద్యోగులు, సిబ్బంది భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. తమకు ఆత్మరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ములుగు-కొత్తగూడెం జిల్లాల్లో కొత్తగా వెలిసిన 27 గుత్తికోయ గూడాలు వెలిశాయని, అడవులను అంతం చేస్తున్న గుత్తి కోయలకు సహకరించే రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాని డిమాండ్ చేశారు అటవీశాఖ అధికారులు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి తమ కార్యాచరణ వెల్లడిస్తామంటున్నారు అధికారులు.

మరోవైపు పోడు సర్వేకు నోచెప్పారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులు. ఆయుదాలిస్తేనే విదుల్లోకి వస్తామని భీష్మించుకు కుర్చుకున్నారు. ఖమ్మం ఘటనతో ఆయుధాలుంటేనే సర్వేకు వెళుతామని తెల్చిచెప్పారు అటవీశాఖ సిబ్బంది. నేడు సర్వే చేసేదే లేదంటూ ఆసిపాబాద్ జిల్లా చింతలమానపల్లి, బెజ్జూర్‌, కాగజ్ నగర్, కౌటాల, పెచికల్ పేట,మంచిర్యాల జిల్లా చెన్నూర్, నెన్నెల ఆదిలాబాద్ భీంపూర్, తాంసి ( కె ) లో పోబు సర్వేను నిలిపి వేశారు. ఆర్వో ఎప్ఆర్ సర్వే కు తాత్కాలికంగా దూరంగా ఉన్నారు అటవిశాఖ సిబ్బంది. రెండవ రోజు నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..