జాక్‌పాట్ అంటే ఇతనిదే.. మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు.. డబ్బే డబ్బు!

అతనో మత్స్యకారుడు.. ఇటీవల భారీ వర్షాలకు కురువడంతో స్థానింకగా ఉన్న ఓ కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ రోజు పూర్తికి కిలో రెండు కేజీల చేపలు పట్టుకొని ఇంటికెళ్దామనుకున్నాడు. కానీ ఆరోజు అతన్ని అదృష్టం వెంటాడింది.అతని వలకు ఏకంగా 36 కేజీల భారీ చేప చిక్కింది. దీంతో అతని సంతోషాకిని అవదుల్లేకుండా పోయాయి.

జాక్‌పాట్ అంటే ఇతనిదే.. మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు.. డబ్బే డబ్బు!
Karimnagar Fishermans Jackpot

Updated on: Aug 14, 2026 | 8:27 AM

జాక్‌పాట్ అంటే ఇతనిదే అని చెప్పాలి.. అవును ఎందుకంటే రోజు కేజీ, రెండు కేజీల చేపలతో ఇంటికెళ్లి ఈ మత్స్యకారుడికి గడిచిన రెండ్రోజుల్లో ఏకంగా సుమారు 56 కేజీల రెండు భారీ చేపలు చిక్కాయి. దీంతో అతని సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన సంపత్ వృత్తిరిత్యా మత్స్యకారుడు. రోజు చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటాడు.

అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు స్థానికంగా ఉన్న ఓ కాలువకు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో ఆ కాలువలో చేపలు పట్టేందుకు స్థానిక మత్స్యకారులంతా క్యూ కట్టారు. రెండ్రోజులుగా అందరూ అక్కడే చేపలు పడుతూ ఉన్నారు. సంపత్‌ కూడా అందరిలానే చేపల వేటకు వెళ్లారు.. అయితే బుధవారం చేపలు పడుతుండగా.. అతని వలకు 20 కేజీల భారీ చేప చిక్కింది. దీంతో అతను ఆరోజు హ్యాపీగా ఇంటికెళ్లాడు.

ఇక గురువారం మళ్లీ చేపలు పట్టేందుకు వచ్చిన సంపత్‌కు ఆ రోజు కూడా మరో జాక్‌పాట్ తగిలింది.. ఈ సారి అతను వేసిన వలకు ఏకంగా 36 కేజీల బొచ్చె చేప చిక్కంది. దీంతో అతని సంతోషం డబుల్ అయిపోయింది. ఆ భారీ చేపను చూసేందుకు మత్స్యకారులు సైతం ఎగబడ్డారు. రెండ్రోజుల్లో రెండు భారీ చేపలు తన వలకు చిక్కడంతో సంపత్ ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us