CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. వారికి రైతు బంధు, రైతు బీమా రద్దు..

|

Oct 20, 2021 | 8:07 PM

రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.

CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. వారికి రైతు బంధు, రైతు బీమా రద్దు..
Cm Kcr
Follow us on

రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. గంజాయి సాగు చేసే రైతులకు రైతు బంధు, రైతు బీమా రద్దు చేయాలని నిర్ణయించారు. ఆర్ఓఎఫ్ఆర్ఓలో గంజాయి సాగు చేస్తే.. వారి పట్టాలను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గంజాయిపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందన్న సీఎం.. పరిస్థితి తీవ్రతరం కాకముందే అప్రమత్తం కావాలని అన్నారు. గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి తగిన ప్రణాళికను సిద్దం చేయాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

గంజాయి‌పై సీరియస్‌గా వ్యవహరించాలన్న సీఎం కేసీఆర్.. విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలన్నారు. అలాగే పాఠ్యపుస్తకాల్లో డ్రగ్స్ ప్రమాదాలపై పాఠాలు పెట్టాలన్నారు. బార్డర్ల వద్ద చెక్ పోస్టుల సంఖ్య పెంచడం, సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. అటు గంజాయిని నిరోధించడానికి డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటలిజెన్స్ శాఖలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని చెప్పారు. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రత్యేక ప్రమోషన్లు, మొదలైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Also Read: