తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. పచ్చి గుడ్ల మయోనైస్‌పై నిషేధం
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పచ్చి గుడ్లతో తయారుచేసే మయోనైస్ ఉత్పత్తి, విక్రయం, నిల్వలపై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తూ ఆహార భద్రతా కమిషనర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాజ్ఞలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పచ్చి గుడ్లతో తయారుచేసే మయోనైస్ ఉత్పత్తి, విక్రయం, నిల్వలపై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తూ ఆహార భద్రతా కమిషనర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాజ్ఞలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లలో పచ్చి గుడ్లను ఉపయోగించి తయారుచేస్తున్న మయోనైస్ కారణంగా అనేకమంది తీవ్ర అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు వెలుగుచూశాయి. పచ్చి గుడ్లలో ప్రమాదకరమైన సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వృద్ధి చెంది, ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తోందని ఆరోగ్య నిపుణులు, ఆహార భద్రతా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉండేందుకు అధికారులు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
