Telangana: ఎలాంటి దురలవాట్లు లేవు.. బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. 23 ఏళ్ల కుర్రాడు..

|

Nov 14, 2024 | 9:31 PM

నేటి యువ భారతం గుండె దడతో అల్లాడుతోంది. ఒకప్పుడు గుండెపోటు 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చేది. కానీ.. ఇప్పుడు పాతికేళ్లలోపు వాళ్లను కూడా గుండెపోటు మృత్యు ఒడిలోకి చేరుస్తోంది. యుక్త వయసులో గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Telangana: ఎలాంటి దురలవాట్లు లేవు.. బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. 23 ఏళ్ల కుర్రాడు..
Sanjeev
Follow us on

చిట్టి గుండెకు ఏదో పెద్ద కష్టమే వచ్చింది. ముసలివాళ్ల సంగతి పక్కనబెట్టండి.. నూనూగు మీసాళ్ల కుర్రాళ్లు ఇప్పుడు హార్ట్ అటాక్‌తో కుప్పకూలి ఆయువు విడుస్తున్నారు. ఎలాంటి దురలవాట్లు లేకపోనివాళ్లను.. హెల్తీ లైఫ్ స్టైల్‌ను పాటించేవాళ్లను కూడా గుండెపోట్లు బలి తీసుకోవడం.. విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కూరావుపేట గ్రామంలో 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో చనిపోయాడు.

కమ్మరిపేట గ్రామానికి చెందిన 23 ఏళ్ల సంజీవ్…  మేన బావ పెళ్లి ఉండటంతో..  మోత్కురావుపేట వచ్చాడు. పెళ్లి పనుల్లో చురకుగా పాలు పంచుకున్నాడు. నవంబర్ 13న పెళ్లి జరగ్గా.. అదే రోజు రాత్రి బరాత్ నిర్వహించారు. బరాత్‌లో సంజీవ్ ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా అక్కడికి తీసుకొచ్చి డ్యాన్స్ చేయించాడు. అంతలోనే పెను విషాదం. అప్పుటివరకు ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ఆ కుర్రోడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. లేపే ప్రయత్నం చేసినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అతడు చనిపోయినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అప్పటివరకు పెళ్లిలో సందడి చేసిన పిల్లాడు మరణించడంతో.. బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..