వామ్మో దెయ్యం.. భయాన్ని పోగొట్టిన ఉపాధ్యాయుడు.. ఏం చేశాడంటే..

| Edited By: Srikar T

Jul 10, 2024 | 8:43 AM

ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం ఆనంద్ పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో దెయ్యం ఉందని విద్యార్థులు భయపడుతున్నారు. ఈ సందర్భంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతల రవీందర్ పిల్లలకు ధైర్యాన్నిచ్చేందుకు సిద్దమయ్యారు. శుక్రవారం రాత్రి అమావాస్య రోజున పాఠశాలలో ఒంటరిగా పడుకొని విద్యార్థులకు ఉన్న దయ్యం భయాన్ని పోగొట్టారు. గత సంవత్సరం 4 తరగతి విద్యార్థి కేమ శ్రావణ్ ఈ దెయ్యం భయంతో పాఠశాల వదిలి ప్రైవేట్ పాఠశాలలో చేరింది.

వామ్మో దెయ్యం.. భయాన్ని పోగొట్టిన ఉపాధ్యాయుడు.. ఏం చేశాడంటే..
Adilabad District
Follow us on

ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం ఆనంద్ పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో దెయ్యం ఉందని విద్యార్థులు భయపడుతున్నారు. ఈ సందర్భంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతల రవీందర్ పిల్లలకు ధైర్యాన్నిచ్చేందుకు సిద్దమయ్యారు. శుక్రవారం రాత్రి అమావాస్య రోజున పాఠశాలలో ఒంటరిగా పడుకొని విద్యార్థులకు ఉన్న దయ్యం భయాన్ని పోగొట్టారు. గత సంవత్సరం 4 తరగతి విద్యార్థి కేమ శ్రావణ్ ఈ దెయ్యం భయంతో పాఠశాల వదిలి ప్రైవేట్ పాఠశాలలో చేరింది. ఈ పాఠశాలకు నూతనంగా బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు నూతల రవీందర్ ఒకరోజు మధ్యాహ్నం పాఠం చెబుతున్న సమయంలో బయట ఏదో చప్పుడు వినిపించింది. దీంతో విద్యార్థులు ఉలిక్కిపడటాన్ని గమనించారు. ఎందుకు భయపడుతున్నారని విద్యార్థులను, ఉపాధ్యాయుడు ప్రశ్నించారు. దీంతో వారు ఈ పాఠశాలలో దయ్యం ఉంది సార్ అందుకే మేము భయపడుతున్నామని చెప్పారు.

ఆ విద్యార్థుల భయాన్ని పోగొట్టడం కోసం అమావాస్య రోజున రాత్రి పాఠశాలలోనీ ఐదవ తరగతి గదిలో దయ్యం ఉందని విద్యార్థులు చెప్పడంతో ఆ గదిలోనే ఒంటరిగా పడుకున్నారు. విద్యార్థులకు ఉన్న అనుమానాన్ని నివృత్తి చేస్తూ వారిలోని భయాన్ని తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వర్ రెడ్డి, తోటి ఉపాధ్యాయులు నూతల రవీందర్‎ని అభినందించారు. ఈ సందర్భంగా నూతుల రవీందర్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదికగా విద్యార్థులలో ఉన్న భయాలను పోగొట్టడం ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతుందని చెప్పారు. జిల్లాలో ఉన్న ఏ పాఠశాలలోనైనా విద్యార్థులు పాఠశాలలో దయ్యం ఉందని భావనతో భయపడుతున్నట్లయితే తనను సంప్రదించాలని తెలిపారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటిగా వెళ్లి ఆయా పాఠశాలల్లో విద్యార్థుల భయాన్ని నివృత్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..