వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణ నెలకొంది. గర్ల్స్ హాస్టల్లో పెచ్చులు ఊడి కిందపడటంతో భయాందోళనకు గురయ్యారు విద్యార్థినిలు. ఆ సమయంలో హాస్టల్ గదిలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. కానీ విద్యార్థుల ఆందోళనలతో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో నెలకొంది. హాస్టల్ సందర్శనకు వచ్చిన రిజిస్ట్రార్, హాస్టల్స్ డైరెక్టర్‌ను విద్యార్థులు నిర్బంధించి హంగామా చేశారు. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని పోతన మహిళా హాస్టల్ గదిలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల ఓ గదిలో ఫ్యాన్ ఊడి మీద పడడంతో ఓ విద్యార్థినికి తీవ్రగాయాలై 12 కుట్లు పడ్డాయి. ఈ ఘటన మరువక ముందే అదే హాస్టల్లో క్యాంపస్‌లో నిన్న రాత్రి సుమారు 10గంటల ప్రాంతంలో 94వ నంబర్ గదిలోని స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి.
పెచ్చులు ఊడి పడిన సమయంలో హాస్టల్ గదిలో విద్యార్థినులు లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రమాదం జరగలేదు. రెండు బెడ్లపై పెచ్చులు ఊడిపడ్డాయి. ఎన్నిసార్లు యూనివర్సిటీ అధికారులకు చెప్పినా ఈ విషయంపై పట్టించుకోవడం లేదని విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. పోతన హాస్టల్ ముందు ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా బాయ్స్ ఆందోళన కొనసాగించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి సమస్యలపై నిర్లక్ష్యం వ్యవహరించిన సంబంధిత అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులను పోతన హాస్టల్ నుంచి వెకెట్ చేయించి వేరే భవనంలోకి మార్చాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న రిజిస్ట్రార్ మల్లారెడ్డి, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్ కుమార్‌ను అదే హాస్టల్ గదిలో వేసి నిర్బంధించారు విద్యార్ధినిలు. దాదాపు గంట పాటు అందులోనే ఉంచారు. పోలీసుల చొరవతో రిజిస్ట్రార్ బయటకు వచ్చారు.. వెంటనే వారికి కొత్త భవనం సమకూర్చి వారిని అందులోకి షిఫ్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..