Sravanamasam: శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం వేళ పువ్వులకు భారీ డిమాండ్.. కొండెక్కిన పువ్వుల ధరలు.. సామాన్యులు షాక్..

| Edited By: Ram Naramaneni

Aug 16, 2024 | 1:26 PM

శ్రావణంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు శుభకార్యాలు కూడా విపరీతంగా ఉన్నాయి.. పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభోత్సవం.. ఇలా అనేక శుభకార్యాలు శ్రావణంలో లేదంటే కార్తీక మాసంలో జరుపుకోవడం ఆనవాయితీ. శ్రావణ శుక్రవారం పూట అమ్మవారిని నాలుగు పూలతో అలంకరించడం కూడా ఫుల్ కాస్లిగా మారింది..ఏ ఇంట్లో ఎక్కువ పూల పరిమళాలు వెదజల్లుతాయో వాళ్లు కాస్త రిచ్ అన్నట్లే.. ఎందుకంటే పూల ధరలు ఆ స్థాయిలో పెరిగిపోయాయి.

Sravanamasam: శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం వేళ పువ్వులకు భారీ డిమాండ్.. కొండెక్కిన పువ్వుల ధరలు.. సామాన్యులు షాక్..
Flower Price Hike
Follow us on

శ్రావణమాసం వచ్చేసింది.. ఓ వైపు ఆధ్యాత్మిక శోభ మరోవైపు శుభమూహూర్తాలు. దీంతో పువ్వుల ధరలే టచ్ చేస్తే షాక్ కొడుతున్నాయి. ఈ శ్రావణంలో పూల ధరల వింటేనే సామాన్యులు అమ్మో అనే పరిస్థితి ఏర్పడింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. పూజలు, శుభకార్యాలకు పువ్వుల ప్రాధాన్యతతో ఈ పువ్వుల ధరలు అమాంతం రెట్టింపు అయ్యాయి.

శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది.. ఏ ఇంట చూసిన పూజలు, నోములు, వ్రతాలు శుభకార్యాలతో కలకలాడుతుంటాయి.. ఇందులో ఏ కార్యం తల పెట్టాలన్నా పువ్వులు అనివార్యం. ఈ శ్రావణంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు శుభకార్యాలు కూడా విపరీతంగా ఉన్నాయి.. పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభోత్సవం.. ఇలా అనేక శుభకార్యాలు శ్రావణంలో లేదంటే కార్తీక మాసంలో జరుపుకోవడం ఆనవాయితీ…

శ్రావణ శుక్రవారం పూట అమ్మవారిని నాలుగు పూలతో అలంకరించడం కూడా ఫుల్ కాస్లిగా మారింది..ఏ ఇంట్లో ఎక్కువ పూల పరిమళాలు వెదజల్లుతాయో వాళ్లు కాస్త రిచ్ అన్నట్లే.. ఎందుకంటే పూల ధరలు ఆ స్థాయిలో పెరిగిపోయాయి. సాధారణంగా 200 రూపాయల కిలో ధర పలికే చామంతి పూలు ఇప్పుడు పూల రకాన్ని బట్టి 350 నుండి 400 రూపాయల ధర పలుకుతుంది.. బంతిపూలు కిలో 150 నుండి 200 రూ., గులాబీలు కిలో 300 నుండి 400 రూపాయలు పలుకుతున్నాయి.. ఏ పువ్వుల ధరలు చూసిన సామాన్యులు అమ్మో అనే పరిస్థితి ఏర్పడింది..

ఇవి కూడా చదవండి

ఏ పూజ చేయాలన్నా పువ్వులు తప్పనిసరి… పువ్వులతో ఆరాధిస్తేనే భగవంతుడి కరుణాకటాక్షాల విస్తాయనేది నమ్మకం.. కానీ పూల ధరలు ముట్టుకుంటే బగ్గుమంటున్నాయి.. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి వ్రతాలు ఆచరించడం ప్రత్యేక పూజలు నిర్వహించడం నోములు, వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.. కానీ పూల ధరలు అతివలను ఆందోళన చెందేలా చేస్తున్నాయి

వరంగల్ కు బెంగళూరు, ఊటీ లాంటి వివిధ ప్రాంతాల నుండి పువ్వులు దిగుమతి అవుతాయి.. కానీ ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల అక్కడ కూడా పూల సాగు తగ్గింది.. దిగుమతి తగడంతో ధరలు అమాంతం పెరిగి పోయాయి.. దీనికి తోడు పెళ్ళిళ్ళు, వివిధ శుభకార్యాలకు పూల డిమాండ్ పెరిగింది..పూల వ్యాపారులు కూడా ఇంత భారీ ధరలతో విక్రయాలు జరపడం దారుణం అంటున్నారు సామాన్యులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..