AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంతకు తెగించావురా.. పల్సర్ బైక్ కొనివ్వలేదని తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు..!

చదివింది ఎనిమిదో తరగతి.. తిరిగేది జులాయిగా.. ఏ పని పాటా లేకుండా.. చెడు తిరుగుళ్ళు తిరుగుతూ.. నిత్యం తల్లిదండ్రులును వేదిస్తున్నాడు ఓ కొడుకు. తాగుడుకు, పోకిరీలతో తిరగడానికి ఖర్చులు కోసం తల్లిదండ్రులు వద్ద డబ్బులు తీసుకునే వాడు.. ప్రతి రోజూ ఇచ్చే స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. చివరికి తనకు పల్సర్ బైక్ కొనివ్వాలని.. సెల్ ఫోన్ రీ ఛార్జ్ చేయాలని తండ్రితో గొడవ పడ్డాడు.

ఎంతకు తెగించావురా.. పల్సర్ బైక్ కొనివ్వలేదని తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు..!
Son Hacks Father
N Narayana Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 18, 2025 | 11:03 AM

Share

చదివింది ఎనిమిదో తరగతి.. తిరిగేది జులాయిగా.. ఏ పని పాటా లేకుండా.. చెడు తిరుగుళ్ళు తిరుగుతూ.. నిత్యం తల్లిదండ్రులును వేదిస్తున్నాడు ఓ కొడుకు. తాగుడుకు, పోకిరీలతో తిరగడానికి ఖర్చులు కోసం తల్లిదండ్రులు వద్ద డబ్బులు తీసుకునే వాడు.. ప్రతి రోజూ ఇచ్చే స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. చివరికి తనకు పల్సర్ బైక్ కొనివ్వాలని.. సెల్ ఫోన్ రీ ఛార్జ్ చేయాలని తండ్రితో గొడవ పడ్డాడు. మాటా మాట పెరిగి, తండ్రిని గొడ్డలితో నరికేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో దారుణం జరిగింది. పల్సర్‌ బైక్ కొనివ్వలేదనే కోపంతో తండ్రిపై గొడ్డలితో కొడుకు దాడి చేశాడు. మంగళగూడెం గ్రామానికి చెందిన నాగయ్య కుమారుడు సతీష్ ఏపని లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తనకు మోటార్ సైకిల్ కొనివ్వాలని తల్లిదండ్రులను కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నాడు. తమ వద్ద డబ్బులు లేవని చెప్పడంతో గత అర్ధరాత్రి సమయంలో తండ్రి నాగయ్యపై.. కొడుకు సతీష్ గొడ్డలితో దాడి చేశాడు. దీంతో నాగయ్య భార్య నాగలక్ష్మి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి సతీష్ పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన నాగయ్యను స్థానికులు చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. తన భర్త నాగయ్యపై కుమారు సతీష్‌ చేసిన దాడి గురించి నాగలక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సతీష్‌ కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..