RTC Special Offers: ఆర్టీసీవారి సంక్రాంతి ఆఫర్లే.. ఆఫర్లు.. వారికి 25 శాతం.. ఇలా ప్రయాణిస్తే బంపర్ బొనాంజా..

ప్రైవేటు ట్రావెల్స్ నుంచి తమ వైపుకు తిప్పుకునేందుకు రెండు రాష్ట్రాల ఆర్టీసీ కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ దీటుగా లాభాల బాట పట్టించేందుకు వివిధ రకాల ప్లాన్స్‌తో దూసుకొస్తోంది.

RTC Special Offers: ఆర్టీసీవారి సంక్రాంతి ఆఫర్లే.. ఆఫర్లు.. వారికి 25 శాతం.. ఇలా ప్రయాణిస్తే బంపర్ బొనాంజా..
Tsrtc Super Luxury Buses
Follow us

|

Updated on: Jan 06, 2023 | 8:30 AM

ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ ఆర్టీసీ సంక్రాంతి పండుగ ఆఫర్లు ప్రకటించాయి. ప్యాసెంజర్లను తమ వైపు తిప్పుకునేందుకు రకరకాల ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు. ప్రయాణికులను గమ్యస్థానాలనుచేరవేసేందుకు ప్రైవేటు బస్సుల వైపు పంపకుండా.. రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. ప్రయాణికులపై అధికభారం పడకుండా ఉండేందుకు ఈయేడాది సాధారణ చార్జీలకే బస్సులు నడుపుతోంది. పండుగ సందర్భంగా 6,400 ప్రత్యేక బస్సులు నడుపుతోన్న ఎపీఎస్‌ఆర్టీసీ సీనియర్ సిటిజన్లకు 25 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

అంతే గాక ఓఆర్ మెరుగుపరచుకునేందుకు ప్రయత్నంచేస్తున్నాయి. ఒక ఫ్యామిలీ తమ పిల్లలతో కలిపి ప్రయాణిస్తే ఛార్జి మెుత్తంలో 5 శాతం రాయితీని ప్రకటించింది. ఇది ఫ్యామిలితో ట్రావెల్ చేసేవారికి లాభాదాయకంగా ఉంటుంది. మరో వైపు ఇప్పుుడు అంతా డిజిటలైజేషన్ కావటంతో మరో ఆఫర్ కూడా ఇచ్చింది ఏపీఎస్ఆర్టీసీ. అదేమంటే.. ఈ వ్యాలెట్ ద్వారా టికెటును బుక్ చేసుకుంటే తమ ఛార్జిలో 5 శాతం నగదును తగ్గించే సౌకర్యాన్ని కల్పించింది.

యాప్, అధికారిక వెబ్ సైట్, ఏజెంట్ ద్వారా టికెట్ కొంటే 5 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ప్రైవేటు బస్సులు వద్దు.. ఆర్టీసీ ప్రయాణం సేఫ్ అంటున్న ఆర్టీసీ నలుగురికి మించి ఒకేసారి టికెట్ బుక్ చేస్తే 5 శాతం వ్యాలెట్ డిస్కౌంట్ ని ఆఫర్‌ చేస్తోంది. అంతేకాదు రెండువైపులా టికెట్ ఒకేసారి కొంటే 10శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది.

ఈ ఆఫర్‌ను పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక బస్సులకూ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. సంక్రాంతి పండుగ సీజన్‌‌లో భారీ ఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది ఏపీఎస్ఆర్టీసీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం