Himayat Sagar: ప్రాజెక్ట్‌ క్రస్ట్‌గేట్‌ వద్ద ఇరుక్కున్న కొండచిలువ.. ఆ తర్వాత ఇది సీన్..

|

Oct 21, 2024 | 1:48 PM

హిమాయత్​ సాగర్​ జలాశయం క్రస్ట్​ గేట్లు వద్ద చిక్కుకుంది కొండ చిలువ. ఎటూ కదల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున కొండ చిలువను గుర్తించిన జలమండలి అధికారులు.. స్నేక్​ క్యాచర్​ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత..

హైదరాబాద్‌ హిమాయత్ సాగర్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది. జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఓ పెద్ద కొండచిలువ ఇరుక్కుపోయింది. గేటు వద్ద ఇరుక్కొని నరకయాతన అనుభవిస్తున్న కొండచిలువను గమనించిన జల మండలి సిబ్బంది వెంటనే స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ సొసైటీ సభ్యుడు ఎంతో శ్రమకోర్చి కొండచిలువను సురక్షితంగా కాపాడాడు.

నడుముకు తాడు కట్టుకొని జలాశయంలోకి దిగిన స్నేక్‌ క్యాచర్‌ క్రస్ట్ గేటుకు చేరుకొని కొండ చిలువనోటిని గట్టిగా పట్టుకొని, కొండచిలువను తన చేతికి చుట్టుకొని తాడు సహాయంతో అతి కష్టంమీద పైకి తీసుకొచ్చాడు. క్రస్ట్ గేటు వద్ద కొండచిలువ ఇరుక్కొని నరక యాతన అనుభవించిందని స్నేక్ సొసైటీ సభ్యుడు తెలిపాడు. జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువను స్నేక్ సొసైటీ సభ్యులు కాపాడటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం భారీ కొండ చిలువను జూ అధికారులకు అప్పగించారు. కొండచిలువను కాపాడిన స్నేక్ సొసైటీ సభ్యులను సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow us on