నగరంలో పబ్స్ గబ్బు లేపుతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా తమ తీరును మార్చుకోవట్లేదు పబ్ యాజమానులు. వివిధ రాష్ట్రల నుండి అమ్మాయిలను తీసుకోని వచ్చి వారిచేత అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా నిబంధనలను ఉల్లంగిస్తూ అర్ధరాత్రుల వరకు మత్తులో మునుగుతున్నారు. తాజాగా బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 8లో ఉన్న ఆఫ్టర్ నైన్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్‌తోపాటు బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా రైట్స్ నిర్వహించారు. ఈ రైట్స్‌లో భాగంగా మొత్తం 100కుపైగా యువతి, యువకులు పట్టుబడ్డారు. పోలీసులు రైట్స్‌కి వెళ్లే సమయంలో ఆశ్లీల నృత్యాలు, డిజె సాంగ్‌లతో మత్తులో తూలుతూ ఉన్నారు. అనంతరం వారందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ రైడ్స్‌లో 35 మంది యువతులు, 75 మంది యువకులు ఉన్నారు. యువతులు అంతా హైదరాబాద్, గుల్బర్గా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారుగా గుర్తించారు. వారిని సైఫాబాద్‌లో ఉన్న రెస్క్యూ హోమ్‌కి తరలించారు. మిగిలిన యువకులను కౌన్సెలింగ్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి పంపించారు. గతంలో కూడా ఆఫ్టర్ నైన్ పబ్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. పార్కింగ్ విషయంలో అప్పటి బంజారాహిల్స్ సిఐగా ఉన్న నరేందర్ సస్పెండ్‌కు గురయ్యారు. అదే పబ్‌లో వివిధ రాష్ట్రల నుండి అమ్మాయిలను రప్పిచి అసభ్య కార్యకలాపాలు నిర్వహించారు. ఆ విషయంలో కూడా కేసు నమోదు చేసిన పోలీసులు పేరు మార్చుకొని మళ్ళీ గలీజ్ దందాకి తెర లేపుతున్నారు. ప్రస్తుతం ఈ పబ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..