AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్లీ సిన్నది.. గంజాయి కథ పెద్దది..! ఆపరేషన్ దూల్‌పేట్ సక్సెస్.. మరి వాట్ నెక్ట్స్..?

గంజాయి మాటెత్తితే తాట తీసేలా వ్యవహారిస్తున్నారు తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, పోలీసులు. ప్రధానంగా.. హైదరాబాద్‌లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు.

గల్లీ సిన్నది.. గంజాయి కథ పెద్దది..! ఆపరేషన్ దూల్‌పేట్ సక్సెస్.. మరి వాట్ నెక్ట్స్..?
Hyderabad Police On Ganja
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Aug 31, 2024 | 5:59 PM

Share

గంజాయి మాటెత్తితే తాట తీసేలా వ్యవహారిస్తున్నారు తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, పోలీసులు. ప్రధానంగా.. హైదరాబాద్‌లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి జాడ తెలిస్తేచాలు.. క్షణాల్లో వాలిపోతున్నారు. చిన్న క్లూ దొరికిందా.. ఇక.. అంతే సంగతులు.. వల పన్ని మరి నిందితుల గంజాయి గుట్టురట్టు చేస్తున్నారు. అయితే.. హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ గంజాయి దొరికినా.. దాని మూలాలు దూల్‌పేట్‌కు కనెక్ట్‌ అవుతుండడంతో పోలీసులు ఆ దిశగా వేట మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే.. దూల్‌పేట్‌లో గంజాయి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసలు. గతంలో గుడుంబాకు అడ్డాగా ఉన్న దూల్‌పేట్‌ను స్పెషల్‌ ఆపరేషన్‌తో గుడుంబా ప్రీ దూల్‌పేట్‌గా మార్చారు. దూల్‌పేట్‌లో గుడుంబా కనుమరుగైపోయి.. గంజాయికి అడ్డాగా మారడంతో దానిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఆపరేషన్‌ దూల్‌పేట్‌ పేరుతో గంజాయిని అంత చూస్తున్నారు. జాడ కనిపిస్తే చాలు తాట తీస్తున్నారు.

ఆపరేషన్ దూల్‌పేట్‌తో గంజాయి డెన్‌లలో దబిడి.. దిబిడి మొదలైంది. డ్రగ్ ఫ్రీ దూల్‌పేట్‌కు ఆగష్టు 31 డెడ్ లైన్ పెట్టుకుంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. వరుస దాడులు నిర్వహించి గంజాయి స్థావారాలను నేల మట్టం చేశారు. నెల రోజుల్లో వంద మందికి పైగా గంజాయి సప్లైర్స్ తోపాటు 110కిలోల గంజాయిని సీజ్ చేసి పలువురిని బైండోవర్ చేశారు. గంజాయి విక్రయమే జీవన ఉపాధి గా పెట్టుకున్న వారిని అరెస్ట్ చేసి కటాకటాలలోకి నెట్టారు. తిరిగి మళ్ళీ ఈ దందాలో దిగకుండా పగడ్బంది ప్రణాళిక తో ముందుకు వెళ్తున్నారు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.

ఒకప్పుడు మత్తు మాఫియాది.. ఆడిందే అట పాడిందే పాట..! అదంతా ఇప్పుడు ఒడిసిన ముచ్చట. ఇప్పుడు లెక్క మారింది. మార్పు మార్కు మత్తు మాఫియా బెండు తీస్తోంది. గుడుంబాను పూర్తిగా నిర్మూలించిన అధికారులు ఇప్పుడు గంజాయి డెన్‌ల భారతం పడుతున్నారు. ఇదే క్రమంలో ఆపరేషన్ దూల్‌పేట్‌తో అష్టదిగ్బంధనం చేసి గంజాయి డెన్‌లను గుట్టురట్టు చేస్తున్నారు. సరకు ఎక్కడి నుండి వస్తుంది. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు. డేటా అంత ఎక్సైజ్ డైరీకి ఎక్కింది. భారీగా గంజాయి సీజ్ చేయడం సహా 100మందిని అరెస్ట్ చేశారు. మరికొందరినీ బైండోవర్ చేశారు. ఫ్యూచర్ లో కూడా గంజాయి మారక ఉండకుండా పక్కడబంది యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఎక్సైజ్ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
మారిన ఎస్బీఐ ఏటీఎం విత్ డ్రా రూల్స్.. ఈ లిమిట్ దాటితే కష్టమే..
మారిన ఎస్బీఐ ఏటీఎం విత్ డ్రా రూల్స్.. ఈ లిమిట్ దాటితే కష్టమే..
శెనగపప్పు మటన్ కూర.. మన తాతలు బలంగా ఉన్నారంటే ఇలాగే
శెనగపప్పు మటన్ కూర.. మన తాతలు బలంగా ఉన్నారంటే ఇలాగే
రూ.250 కోట్ల లాటరీ గెలిచిన యువకుడు.. ఆ డబ్బుతో ఏం చేశాడంటే?
రూ.250 కోట్ల లాటరీ గెలిచిన యువకుడు.. ఆ డబ్బుతో ఏం చేశాడంటే?
కాశీలో మరణించాలనే కోరిక ఎందుకు? మోక్షంపై ఉన్న పురాతన విశ్వాసం ఇదే
కాశీలో మరణించాలనే కోరిక ఎందుకు? మోక్షంపై ఉన్న పురాతన విశ్వాసం ఇదే
ఇలా స్టోర్‌ చేస్తే వారమైనా కూరగాయలు ఫ్రెష్‌గా ఉండాల్సిందే!
ఇలా స్టోర్‌ చేస్తే వారమైనా కూరగాయలు ఫ్రెష్‌గా ఉండాల్సిందే!
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్..
జున్నుపాలు లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు హెల్దీ జున్ను
జున్నుపాలు లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు హెల్దీ జున్ను
నిప్పులకొలిమిలా మంచు ఖండం.. యూరప్ అంతటా ఆగమాగం..
నిప్పులకొలిమిలా మంచు ఖండం.. యూరప్ అంతటా ఆగమాగం..
రోజూ వాడే కిచెన్ కత్తి ఎలా ఉండాలి? కొనేముందు ఈ విషయాలు తెలసుకోండి
రోజూ వాడే కిచెన్ కత్తి ఎలా ఉండాలి? కొనేముందు ఈ విషయాలు తెలసుకోండి
భర్త మరణిస్తే భార్య క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా..? రూల్స్ ఇవే.
భర్త మరణిస్తే భార్య క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా..? రూల్స్ ఇవే.