Hyderabad: భాగ్యనగర వాసులకు మాంచి కిక్కిచ్చే వార్త.. నెక్లెస్ రోడ్డులో ‘నీరా కేఫ్’.. అచ్చం పల్లెటూర్లో ఉన్నట్లే ఏర్పాట్లు..

|

Dec 03, 2022 | 4:49 PM

కేఫ్ అంటే చాయ్, కాఫీ అమ్ముతారు అక్కడ అనుకుంటాం. కానీ హైదరబాద్ నెక్లెస్ రోడ్డులో త్వరలో ఏర్పాటు కానున్న కేఫ్‌లో అంతకు మించిన డ్రింక్ అమ్మనున్నారు.

Hyderabad: భాగ్యనగర వాసులకు మాంచి కిక్కిచ్చే వార్త.. నెక్లెస్ రోడ్డులో ‘నీరా కేఫ్’.. అచ్చం పల్లెటూర్లో ఉన్నట్లే ఏర్పాట్లు..
Neera Cafe
Follow us on

కేఫ్ అంటే చాయ్, కాఫీ అమ్ముతారు అక్కడ అనుకుంటాం. కానీ హైదరబాద్ నెక్లెస్ రోడ్డులో త్వరలో ఏర్పాటు కానున్న కేఫ్‌లో అంతకు మించిన డ్రింక్ అమ్మనున్నారు. అవును.. మరికొన్ని రోజుల్లో ‘‘నీరా కేఫ్’’ ప్రారంభం కానుంది. నీరా అంటే కేఫ్ పేరు అనుకుంటారేమో.. కానే కాదు. తాటి కల్లు, ఈత కల్లు మాదిరిగానే ఉంటుంది ఈ నీరా. ఈ నీరా కథ ఏంటో, ఎక్కడ ఈ కేఫ్‌ను ఏర్పాటు చేయనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెరలాంటి తీయని రుచిని పంచే పానీయం నీరా. తాటి, ఈత, కొబ్బరి చెట్లతో పాటు ఖర్జూర, జీలుగ చెట్ల నుంచి ఉత్పత్తి చేస్తారు. నీరా ఆల్కహాలు లేని సహజసిద్ధమైన ద్రవం. కల్లు తీసే క్రమంలో కుండలో స్వల్ప పరిమాణంలో నీరు, మడ్డి (పాతకల్లు) కలిపి చెట్టుకు కట్టడం ద్వారా కల్లు లభిస్తుంది. అయితే నీరా తీసే ముందు అమర్చిన కొత్తకుండలో ఎలాంటి నీరు, మడ్డి వేయకుండా.. తాజాగా లభించే పానీయమే నీరా. ఏ చెట్టు నీరా అయినా రుచితోపాటు, ఆరోగ్యాన్ని పంచుతుంది. వ్యాధులను నివారించే ఔషధగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాల్లో వెల్లడైంది.

ఆరోగ్య ప్రయోజనాలు..

నీరాలోని పోషకాలు మనుషుల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తకణాల వృద్ధికి దోహదపడే పోషకాలు సైతం నీరాలో ఉన్నాయి. అజీర్తి, మలబద్దకాన్ని దూరం చేస్తుందిది. మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే.. నీరాతో కొంతవరకు సమస్యను తగ్గించవచ్చు..చెట్ల నుంచి కల్లు తీసే ముందు వచ్చే మొదటి దశనే నీరా. దీనికి కాస్త వేడి తగిలితే మెల్లగా పులిసి కల్లుగా మారుతుంది. కల్లుగా మారక ముందున్న నీరా పానీయం ఎలాంటి మత్తు కలిగించదు. ఉదయాన్నే వచ్చే నీరా ని నెక్లెస్ రోడ్ పై ఏర్పాటు చేసిన నీరా కేఫ్ కి తీసుకొచ్చాకా అది కళ్ళు గా మారకుండా టెక్నాలజీ వాడుతూ ఉన్న నీరా నీ శుద్ధి చేసి ప్రజలకు అందించనున్నారు.

ఇవి కూడా చదవండి

నీరా కేఫ్‌..

మార్కెట్‌లో రకరకాల మద్యపానం బ్రాండ్లు ఉన్నట్లే.. ప్రకృతిప్రసాదితమైన కల్లులకు బ్రాండ్‌ తీసుకొస్తే.. కులవృత్తి పరిశ్రమ స్థాయికి ఎదుగుతుంది. అయితే అందులో గీతకార్మికులకు భాగస్వామ్యం ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. ఈ ప్రయత్నంలో భాగమే నీరాకేఫ్‌. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో నీరాకేఫ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇటీవలే మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. తాటిమొద్దులు, ఈత మొద్దులపై కూర్చున్నట్లు అనిపించే రీతిలో సీట్లను డిజైన్‌ చేస్తున్నారు. వాటిపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ కల్లుతో ఛీర్స్‌ చెప్పుకోవచ్చు. తెలంగాణ వంటకాల స్టాల్స్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. గీతకార్మికుల అస్తిత్వానికి ప్రతీక నీరాకేఫ్‌. ఇతర పానీయాలతో పోల్చితే నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పటి వరకు కాంబోడియా, ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో నీరా ఉత్పత్తి అధికంగా ఉంది. హైదరాబాద్‌ నగరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమవుతున్న నీరాకేఫ్‌ మరికొన్ని రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకుని.. నగర ప్రజలకు కొత్త రుచులు అందించనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..