AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ప్రియుడితో ఆ యవ్వారం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త బంధువులు.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

నల్గొండ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. తన ప్రియుడితో కలిసి ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్న భర్త బంధువులు వాళ్లిదరిని చితకబాదారు. విచిత్రంగా భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించాల్సిన భార్య.. తన భర్తకు దేహాశుద్ధి చేసిన ప్రియురాలి బంధువులపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.

Watch Video: ప్రియుడితో ఆ యవ్వారం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త బంధువులు.. తర్వాత ఏం జరిగిందో చూడండి!
Nalgonda Extramarital Affai
M Revan Reddy
| Edited By: Anand T|

Updated on: Aug 03, 2025 | 4:14 PM

Share

వివాహేతర సంబంధాలతో భార్యల చేతుల్లో భర్తల హత్యలు.. భర్తల చేతుల్లో భార్యలు హత్యలకు గురి కావడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కేసులు సమాజంలో వివాహ సంబంధాలలో పెరుగుతున్న ఒత్తిడులు, అనుమానాలు, నమ్మక లేనితనాన్ని తెలియ జేస్తున్నాయి. ఇలాంటి చాలా కేసుల్లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. తాజాగా ప్రియుడుతో కలిసి ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్న భర్త బంధువులు వాళ్లిదరిని చితకబాదారు. విచిత్రంగా భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించాల్సిన భార్య.. తన భర్తకు దేహాశుద్ధి చేసిన ప్రియురాలి బంధువులపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాలాజీ తండాకు చెందిన రమేష్ కు కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. రమేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తిరుమలగిరి మండలం నాయకుని తండాకు చెందిన వివాహితతో రమేష్‌ కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు కూడా తలెత్తాయి. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు చాలాసార్లు హెచ్చరించినప్పటికీ వినకుండా ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుమలగిరి మండలం నాయకుని తండాలో వివాహిత ఇంట్లో ఇద్దరు ఏకాంతంగా ఉండగా వివాహిత భర్త బంధువులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను వివాహిత భర్త బంధువులు వీడియో తీసి వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న రమేష్ భార్య.. తన భర్తను కొట్టారంటూ వివాహిత మహిళ భర్త బంధువులపై తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న తన భర్తను ప్రశ్నించాల్సింది పోయి.. స్థంభానికి కట్టేసి కొట్టారంటూ భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న జంటను పోలీసులకు అప్పగించకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నందుకు వివాహిత భర్త బంధువులపై తిరుమలగిరి పోలీసులు 323, 341 బీఎన్ ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన మహిళ.. వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.