Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్ కలకలం..! కామారెడ్డి వ్యక్తికి లక్షణాలు..

|

Jul 24, 2022 | 7:18 PM

తెలంగాణలో కూడా మంకీపాక్స్ కలకలం రేపింది. కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు సమాచారం.

Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్ కలకలం..! కామారెడ్డి వ్యక్తికి లక్షణాలు..
Monkeypox
Follow us on

Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా కరోనా పీడ ముగియముందే.. మంకీపాక్స్ మహమ్మారి అలజడి రేపుతోంది. విదేశాలతోపాటు భారత్‌లో సైతం కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. కాగా.. తెలంగాణలో కూడా మంకీపాక్స్ కలకలం రేపింది. కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు సమాచారం. కామారెడ్డికి చెందిన వ్యక్తికి లక్షణాలు కనిపించడంతో.. బ్లడ్ శాంపిళ్లను సేకరించి హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి పరీక్షల కోసం తరలించారు. మంకీపాక్స్ లక్షణాలున్నట్లు అనుమానిస్తున్న బాధితుడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కాగా.. బాధితుడు ఈ నెల 6న కువైట్ నుంచి కామారెడ్డి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. లక్షణాలున్నట్లు అనుమానం వ్యక్తమవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరీక్షల రిపోర్టు అనంతరం అన్ని విషయాలను వెల్లడిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అధికారులు ఆ వ్యక్తి కాంటాక్ట్‌లను ట్రేస్ చేశారు. అందరినీ పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం, అధికారుల నుంచి దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..