Harish Rao: మోడీ ఆనాడు గుజరాత్‌లో మన్మోహన్‌ ఫొటో పెట్టారా..? నిర్మలమ్మ వ్యాఖ్యలపై హరీశ్‌ రావు ఫైర్

|

Sep 05, 2022 | 7:46 AM

కేంద్రం నిధులు ఉపయోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందేనని చెప్పడంలో ఔచిత్యం లేదని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో గుజరాత్‌ లోని రేషన్‌ షాపుల్లో ఆయన ఫొటో పెట్టారా? అని ప్రశ్నించారు.

Harish Rao: మోడీ ఆనాడు గుజరాత్‌లో మన్మోహన్‌ ఫొటో పెట్టారా..? నిర్మలమ్మ వ్యాఖ్యలపై హరీశ్‌ రావు ఫైర్
Harish Rao Nirmala Sitharaman
Follow us on

Harish Rao on Niramala Sitharaman comments: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌పై మరోసారి తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అర్ధరహితం.. అసంబద్ధంగా ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు. కేంద్రం నిధులు ఉపయోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందేనని చెప్పడంలో ఔచిత్యం లేదన్నారు. మన్మోహన్‌సింగ్‌ ప్రధాని ఉన్న సమయంలో గుజరాత్‌ లోని రేషన్‌ షాపుల్లో ఆయన ఫొటో పెట్టారా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం సబబుగా లేదన్నారు. నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్థిక మంత్రి హరీశ్ రావు 9 పేజీల లేఖను రాశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ తెలంగాణ పర్యటనలో అసంబద్ధ వ్యాఖ్యలు చేశారంటూ వివరించారు. నరేంద్ర మోడీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు రేషన్‌ షాపుల్లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఫొటో పెట్టారా? అని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం సమాఖ్య విలువలను కాలరాస్తుందని.. రాష్ట్రానికి వచ్చి మూడు ఆరోపణలు, ఆరు అబద్ధాలు ఆడి రాజకీయం చేస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకోదంటూ హెచ్చరించారు. ప్రజలు టీఆర్‌ఎస్‌పై, సీఎం కేసీఆర్‌ పాలనపై, ప్రభుత్వ పథకాలపై పూర్తి స్పష్టతతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌ రావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని తెలిసినా నిర్మల పచ్చి అబద్ధాలు మాట్లాడారంటూ విమర్శించారు. విభజన హామీలు అమలు చేయకుండా.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ ప్రజలకు నిర్మల క్షమాపణ చెప్పాల్సిందే: పల్లా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఫైరయ్యారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. అబద్ధపు ఆరోపణలతో.. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను వ్యక్తం చేశారని విమర్శించారు. దేశ ఆర్థిక మంత్రి పదవికి తగని సీతారామన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలకు,రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..