Rayadurgam Kidnapping Case: ‘తెలిసినవాళ్లని కిడ్నాప్‌ చేసి.. ఎంతో కొంత డిమాండ్ చేసి దండుకోవడం వీరి స్టైల్‌’ మాదాపూర్ ఇంచార్జ్ డీసీపీ శ్రీనివాస్

| Edited By: Srilakshmi C

Jan 07, 2024 | 1:41 PM

హైదరాబాద్‌ రాయదుర్గంలో సంచలనం రేపిన సురెందర్‌ కిడ్నాప్‌ కేసు వివరాలను మాదాపూర్ ఇంచార్జ్ డీసీపీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'నాలుగో తేదీన ఖాజగూడ వద్ద సురేందర్ అనే వ్యక్తి కిడ్నాప్ అయినట్టు డయల్ హండ్రెడ్ ద్వారా సమచారం అందింది. కిడ్నాప్ కేసును 48 గంటల్లో చేదించాం. అరున్నర గంటలకు కిడ్నాప్ సమాచారం అందగానే వెంటనే ఘటనా..

Rayadurgam Kidnapping Case: తెలిసినవాళ్లని కిడ్నాప్‌ చేసి.. ఎంతో కొంత డిమాండ్ చేసి దండుకోవడం వీరి స్టైల్‌ మాదాపూర్ ఇంచార్జ్ డీసీపీ శ్రీనివాస్
Rayadurgam Kidnapping Case
Follow us on

మాదాపూర్, జనవరి 7: హైదరాబాద్‌ రాయదుర్గంలో సంచలనం రేపిన సురెందర్‌ కిడ్నాప్‌ కేసు వివరాలను మాదాపూర్ ఇంచార్జ్ డీసీపీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నాలుగో తేదీన ఖాజగూడ వద్ద సురేందర్ అనే వ్యక్తి కిడ్నాప్ అయినట్టు డయల్ హండ్రెడ్ ద్వారా సమచారం అందింది. కిడ్నాప్ కేసును 48 గంటల్లో చేదించాం. అరున్నర గంటలకు కిడ్నాప్ సమాచారం అందగానే వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాం. బాధితుడి కజిన్ నిఖితతో వచ్చిన వారే కిడ్నాప్ చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో నిఖితను ప్రశ్నించాం. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు అరు టీంలను ఫామ్ చేసాం. నిఖిత, వెంకటకృష్ణ, సురేష్ ఈ కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించారని తెలిపారు.

‘తొలుత సురేందర్‌ను కిడ్నాప్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. పోలీసులు వెంటపడుతున్నారని తెలిసి కిడ్నాప్ అయినా సురేందర్ చేత వాలంటీర్‌గా వెళుతున్నానని చెప్పించారు. విచారణ అవసరం లేదు వాలంటీర్‌గా తానే వచ్చేస్తున్నట్టు చెప్పించారు. పవన్ కల్ రోడ్‌లో వెళ్తున్న సమయంలో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న కారు ఆగిపోయింది. అనంతరం సురేందర్ కుటుంబ సభ్యులకు అతను కిడ్నాప్‌ అయిన విషయం వెంకటకృష్ణతో చెప్పించారు. సురేందర్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న సమయంలో వారి కారును కర్తాల్ వద్ద ఫారెస్ట్ అధికారులు ఆపారు. ఫారెస్ట్ అధికారులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. వెంటనే ఫారెస్ట్‌ అధికారులు సురేందర్‌ను రక్షించారని’ అన్నారు.

‘అయితే ముందుగా రెండు కోట్లు డిమాండ్ చేసి, అనంతరం 20 లక్షలు ఇచ్చిన చాలు అని కిడ్నాపర్లు కోరారు. ఈ కిడ్నాప్‌లో పాలుపంచుకున్న సురేష్ పై 21 కేసులు ఉన్నాయి. నికిత, వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కిడ్నాప్ చేసి వచ్చిన డబ్బుతో విలాసంవంతగా గడపాలనుకున్నారు. ఈ గ్యాంగ్ గచ్చిబౌలిలోని ఒక కిడ్నాప్ కేసులో కూడా నిందితులుగా ఉన్నారు. వెంకట కృష్ణ పై జీడిమెట్ల సీఎస్‌లో ఎన్డీపీఎస్ కేసుతోపాటు మరొక కిడ్నాప్ కేసు కూడా ఉంది. తెలిసినవాళ్లని బెదిరించడం ఎంతో కొంత డిమాండ్ చేసి దండుకోవడం వీరు చేసే పని. నిందితులపై గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాం.. ప్రధాన నిందితుడిపై పీడీ యాక్ట్ పెడతామని ‘డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.