Lagacharla Incident: లగచర్ల కేసులో కీలక మలుపులు.. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్‌ పిటిషన్‌

|

Nov 14, 2024 | 9:26 PM

లగచర్ల కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఓవైపు సీరియస్‌ ఇన్వెస్టిగేషన్‌. మరోవైపు అరెస్ట్‌ల అటెన్షన్‌. ఇంతలోనే బిగ్‌ ట్విస్ట్‌. రిమాండ్‌లో ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి సంచలన లేఖ రాశారు. మరి లేఖలో పట్నం ఆరోపణలు ఏంటి...? కేసు ఎంక్వైరీ అప్‌డేట్‌ ఏంటి...?

Lagacharla Incident: లగచర్ల కేసులో కీలక మలుపులు.. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్‌ పిటిషన్‌
Lagacharla Incident
Follow us on

లగచర్ల లడాయిలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు తెరపైకి వస్తుండటంతో ఈ ఇష్యూపై మరింత అటెన్షన్‌ పెరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ లగచర్ల ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. వారి ద్వారా కోర్టుకు నరేందరెడ్డి అఫిడవిట్ పంపించారు. పోలీసులు నిబంధనలు పాటించలేదని తెలిపారు. అరెస్ట్‌ సమయంలో కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదన్నారు. సంబంధం లేని కేసులో ఇరికించారని ఆరోపించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టుకు విన్నవించారు. మరోవైపు పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టుపై జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి లేఖ విడుదల చేశారు. తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పని.. కేటీఆర్‌ గురించి పోలీసులకు తానేమి చెప్పలేదన్నారు. పోలీసులు తన నుంచి స్టేట్‌మెంట్ తీసుకోలేదని తెలిపారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఏముందో తనకు తెలియదన్నారు. తన అడ్వొకేట్ కోరితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చార్నారు పట్నం నరేందర్‌రెడ్డి.

7రోజుల కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్‌

మరోవైపు వికారాబాద్‌ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్‌ వేశారు. నరేందర్‌రెడ్డిని 7రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్‌ వేశారు. విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇటు పట్నం నరేందర్‌రెడ్డి కూడా వికారాబాద్‌ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేశారు. రెండింటిని సోమవారం విచారిస్తామని కోర్టు తెలిపింది.

ఇక లగచర్ల లడాయి పొలిటికల్ టర్న్‌ తీసుకోవడంతో ఇష్యూపై అటెన్షన్‌ పెరిగింది. ఘటనలో కుట్ర కోణం ఉందని తేలడంతో మరింత రచ్చ రాజుకుంది. ప్రస్తుతం ఉన్నతస్థాయిలో ఎంక్వైరీ జరుగుతోంది. కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. పరిగి పోలీస్‌స్టేషన్‌కు అడిషనల్ డీజీ మహేష్‌ భగవత్, ఐజీ సత్యనారాయణ వెళ్లారు.

లగచర్ల ఘటనలో మొత్తం మూడు కేసులు నమోదు

ఇక లగచర్ల ఘటనలో మొత్తం మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు… ఇప్పటివరకు 21మందిని అరెస్ట్‌ చేశారు. 47మంది నిందితులను గుర్తించామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. మహేష్, సురేష్, రాజు కలిసి కలెక్టర్‌ను ట్రాప్‌ చేశారన్నారు. మరోవైపు ఇప్పటికే పట్నం నరేందర్‌రెడ్డి ఫోన్‌ను ఓపెన్ చేసి డేటా పరిశీలించిన పోలీసులు… నరేందర్, సురేష్ కాల్స్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు. ఈ ఫోన్‌ డేటా ఆధారంగా ఈ కేసు మరో మలుపు తిరిగే ఛాన్స్‌ ఉంది.

ఇక విచారణలో సంచలన అంశాలు బయటికి వచ్చాయి. ప్రభుత్వ నోటిఫికేషన్‌లో భోగమోని సురేష్‌కు సంబంధించి ఎలాంటి భూమి లేదని పోలీసులు తేల్చారు. 42మంది నిందితుల్లో 19మందికి అస్సలు భూమే లేదని ఐజీ నివేదిక ఇచ్చారు. దాంతో, సురేష్‌, పట్నం నరేందర్‌రెడ్డికి..ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా కేటీఆర్‌తో పాటు..ఇతరుల ఆదేశాలున్నట్టు రిమాండ్‌ రిపోర్ట్ వెల్లడించారు పోలీసులు. మరి కేసులో నెక్ట్స్‌ ఏం జరుగుతుందో చూడాలి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..