Hyderabad Liberation Day: అక్షర యోధుడు.. నిజాం నిరంకుశత్వంపై షోయబుల్లా ఖాన్ కలం పోరాటం..

|

Sep 16, 2022 | 12:33 PM

స్వాతంత్ర్య సమరయోధుడు షోయబుల్లా ఖాన్. నిజాంకు వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాసిన పాత్రికేయుడు. ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక..

Hyderabad Liberation Day: అక్షర యోధుడు.. నిజాం నిరంకుశత్వంపై షోయబుల్లా ఖాన్ కలం పోరాటం..
Shoaib Ullah Khan
Follow us on

కలమే ఖడ్గంగా.. అక్షరమే ఆయుధంగా నిజాం సర్కార్‌పై పోరాటం చేసిన షోయబుల్లా ఖాన్. తాను రాసే వ్యాసాలతో వణుకు పట్టించాడు. రాజరిక పాలనను ముగింపు పలకాలంటూ.. భారత ప్రభుత్వంలో హైదరాబాద్ సంస్థానాన్ని కలిపేయాలంటూ అక్షర పోరాటం చేశాడు స్వాతంత్ర్య సమరయోధుడు షోయబుల్లా ఖాన్. నిజాంకు వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాసిన పాత్రికేయుడు. ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలను తన తేజ్ పత్రికలో ప్రచూరిచాడు. తేజ్ పత్రికను నిజాం ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అనంతరం కాలంలో స్వీయ నిర్వహణలో ఇమ్రోజ్ అనే మరో దినపత్రికను షోయబుల్లా ఖాన్ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేయడమే సరైన నిర్ణయమని తెలుపుతూ నిజాం సర్కార్‌లోని కొందరు పెద్దలు రూపొందించిన ఒక పత్రాన్ని షోయబుల్లా ఖాన్ తన ఇమ్రోజ్ పత్రికలో యథాతథంగా ప్రచురించారు. ఈ ప్రకటనాంశాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ఉపయోగించుకుంటుందేమోనని నిజాం భయపడ్డాడు. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత అనాగరిక హత్యకు సాక్షిగా నిలిచింది. ఉర్దూ దినపత్రిక సంపాదకుడు షూబుల్లాఖాన్‌ను ఇంటికి వెళ్లే మార్గంలో దారిలో హత్య చేశారు.  28 సంవత్సరాల వయస్సులో నిజాం రజాకార్లు ఆయన్ను అతి దారుణంగా హత్య చేశారు.

షోయెబుల్లా ఖాన్ విద్యాభ్యాసం..

షోయెబుల్లా ఖాన్ విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాకా పత్రికావృత్తిలో అడుగు పెట్టారు. షోయబుల్లాఖాన్ రచనా జీవితం తాజ్వీ పత్రికలో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలు రచించారు. షోయెబుల్లా ఖాన్ రచనల్ని ప్రచురిస్తున్న కారణంగా నిజాం ప్రభుత్వం తాజ్వీ పత్రికను నిషేధించింది.. ఆ సమయంలోనే ప్రసిద్ధ కాంగ్రెస్‌నాయకుడు ముందుముల నరసింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ఇమ్రోజు పత్రికలో సంపాదకునిగా బాధ్యతలు తీసుకున్నారు.

ఇమ్రోజు పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని విధానపరంగా విభేదించింది. అప్పటికే ముమ్మరంగా తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతోంది. ఆ సందర్భంలో రయ్యత్ పత్రికలో నిజాం ప్రభుత్వం అమలుచేస్తున్న దమనకాండ, ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు రజ్వీని ఉసిగొలుపుతున్న పద్ధతులను వ్యతిరేకిస్తూ రచనలు చేశారు షోయెబుల్లా ఖాన్. ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం వేటు వేసింది.

అప్పటికే హైదరాబాద్ ప్రాంతంలో రాజకీయ స్థితిగతులు అప్పటికే వేడెక్కాయి. పాకిస్తాన్‌కు కోట్లాది రూపాయలు ధనసహాయం చేయడం వంటి చర్యలు నిజాం, రాజ్యంలోని ప్రజలతో దాదాపుగా యుద్ధం చేస్తూ ఖాసింరజ్వీ పరిస్థితుల్ని మార్చేశాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం