AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పూజ గదిలోకి వెళ్తే.. సాక్షాత్తూ నాగరాజే దర్శనమిచ్చాడు.. మామూలు సీన్ కాదు మావ..

దేవుడినీ భక్తితో మొక్కేందుకు పూజ గదిలోకి వెళ్లిన ఆ కుటుంబ సభ్యులకు.. అక్కడ సాక్షాత్తూ నాగరాజు పడగ విప్పి దర్శనమిచ్చాడు. సాధారణంగా దైవ స్వరూపంగా భావించినా, ఆ పాము ఒక్కసారిగా బుసలు కొట్టడంతో ఆ ఇంటి సభ్యులు అందరూ హడలెత్తిపోయారు. వెంటనే అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు.

Viral: పూజ గదిలోకి వెళ్తే.. సాక్షాత్తూ నాగరాజే దర్శనమిచ్చాడు.. మామూలు సీన్ కాదు మావ..
King Cobra Snake Video
P Shivteja
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 1:13 PM

Share

దేవుడినీ భక్తితో మొక్కేందుకు పూజ గదిలోకి వెళ్లిన ఆ కుటుంబ సభ్యులకు.. అక్కడ సాక్షాత్తూ నాగరాజు పడగ విప్పి దర్శనమిచ్చాడు. సాధారణంగా దైవ స్వరూపంగా భావించినా, ఆ పాము ఒక్కసారిగా బుసలు కొట్టడంతో ఆ ఇంటి సభ్యులు అందరూ హడలెత్తిపోయారు. వెంటనే అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలోనీ మహేందర్ అనే వ్యక్తి ఇంట్లో వెలుగులోకి వచ్చింది.. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతి రోజులాగే ఇంట్లో పనుల్లో నిమగ్నమైన కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా పూజ గది నుంచి వింత శబ్ధాలు వినిపించాయి.

తీరా లోపలికి వెళ్లి చూసే సరికి మూడు అడుగుల పొడవైన నాగుపాము కనిపించడంతో వారు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్థానికులు కొందరు భయంతోనే పాముకు పాలు సమర్పించి దండాలు పెట్టుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్ సద్దాం కు ఫోన్ చేశారు.

వీడియో చూడండి..

హుటాహుటిన అక్కడికి చేరుకున్న సద్దాం, అత్యంత చాకచక్యంగా పూజ గదిలో నక్కి ఉన్న నాగుపామును పట్టుకున్నాడు. అనంతరం ఆ విష సర్పాన్ని సురక్షితంగా నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో చల్లదనం కోసం విషసర్ఫాలు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. కావున అందరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us