Watch Video: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వారికే అప్పగించాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఉత్తంకుమార్ రెడ్డి.. గత ప్రభుత్వం ఆర్భాటంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాజెక్టులను గుర్తు చేశారు.

Watch Video: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వారికే అప్పగించాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Minister Uttamkumar Reddy
Follow us

|

Updated on: Jul 20, 2024 | 9:00 PM

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఉత్తంకుమార్ రెడ్డి.. గత ప్రభుత్వం ఆర్భాటంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాజెక్టులను గుర్తు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు తెలిపారు. అయితే ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కాళేశ్వరంను నిర్మించారన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌లోని అన్ని గేట్లను ఎత్తి ఉంచాలని NDSA సూచించిందన్నారు. వచ్చిన నీళ్లు మొత్తం కిందకు వదలమన్నారని.. మూడు బ్యారేజ్‌లలోని నీటిని కిందకు వదులుతున్నామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో ఒక గేటు ఎత్తడం వీలుకాలేదని.. దీంతో ఆ గేటును పూర్తిగా కట్ చేశామని చెప్పారు. NDSA సూచనలను త్వరలోనే కేబినెట్‌లో చర్చిస్తామన్నారు.

ప్రస్తుతం NDSA అధికారులతో కాళేశ్వరంపై సమీక్ష చేశామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సోమవారం ఈ ప్రాజెక్టు విషయంలో ఇంజనీర్ల స్థాయిలో చర్చలు కొనసాగుతాయన్నారు. తాము చెప్పిన దానిప్రకారం ప్రాజెక్టు కట్టి ఉంటే సంవత్సరానికి వెయ్యి కోట్లు విద్యుత్ కు ఖర్చు అయ్యేదన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తై అన్ని పంపులు నడిపితే ప్రతి ఏటా కరెంట్ ఖర్చులే 10వేల కోట్లు అవుతాయని వివరించారు. గతంలో కాగ్ చెప్పిన లెక్కలకంటే కూడా ఎక్కువ ఖర్చు దీని నిర్మాణానికి అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం డ్యామ్ సేఫ్టీ అధికారులకు ఈ ప్రాజెక్టును అప్పగించామన్నారు. వారి ఆదేశాల మేరకే తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ పనులను ఎంతమేర పరిశీలించారు, భవిష్యత్తులో చేపట్టే ప్రణాళికలపై కూడా దృష్టిపెట్టినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు మరమ్మత్తులకు సంబంధించి కొన్ని రిపోర్టులను ఇచ్చినట్లు తెలిపారు. వాటిని నేషనల్ ఏజెన్సీలకు అప్పగించి.. రానున్న రోజుల్లో ఎంత ఖర్చు అవుతుందని NDSA అధికారులను అడిగి ఒక నివేదిక తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..