మంత్రి పొంగులేటికి తప్పిన ముప్పు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

|

Jan 12, 2025 | 10:46 PM

తెలంగాణ మంత్రి పొంగులేటికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుమలాయపాలెం దగ్గర పొంగులేటి కారుకు ప్రమాదానికి గురైంది. ఒకేసారి రెండు టైర్లు పేలడంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సేఫ్‌గా కారును బ్రేక్ చేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ఎస్కార్ట్ కారులో ఖమ్మం క్యాంప్ ఆఫీస్‌కు బయలుదేరారు మంత్రి పొంగులేటి.

మంత్రి పొంగులేటికి తప్పిన ముప్పు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
Minister Pongulti Srinivas Reddy Car Accident
Follow us on

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు ఆదివారం (జనవరి 12) రాత్రి ప్రమాదానికి గురైంది. అధికారిక కార్యాక్రమాల్లో పాల్గొని, వరంగల్‌ నుంచి ఖమ్మం వస్తుండగా కారు టైర్లు పేలిపోయాయి. తిరుమలాయపాలెం వద్ద ఒక్కసారిగా రెండు టైర్లు పేలడంతో కారు అదుపుతప్పింది. కారు డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో మంత్రికి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన తర్వాత మంత్రి పొంగులేటి ఎస్కార్ట్‌ వాహనంలో ఖమ్మం చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రితోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..