Women Suicide In Hyderabad: హైదారాబాద్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉపవాసం ఉండొందు అన్నందుకు ఓ యువతి ఊపిరితీసుకుంది. ఈ దారుణ సంఘటన బేగంపేట పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గుంటూరు చెందిన దేవి నాగమ్మ (19) గత కొన్నేళ్లుగా ఇద్దరు అక్కలతో కలిసి ప్రకాస్ నగర్లో నివాసముంటోంది. నాగమ్మకు ప్రతీ సోమవారం ఉపవాసం ఉండడం అలవాటు ఉంది. అయితే ఈ మధ్యకాలంలో అనారోగ్యం బాగా క్షీణించడంతో ఆమె అక్క నాగమ్మను మందలించింది. ఈ కారణంగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగమ్మ ఈ నెల 9న ఇంట్లో ఉరేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన పెద్దక్క, బావ.. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయిదు రోజుల చికిత్స అనంతరం నాగమ్మను తాజాగా గాంధీ ఆసుపత్రికి మార్చారు. ఈ క్రమంలో కొన్ని రోజులు చికిత్స పొందిన తర్వాత పరిస్థితి విషమించడంతో నాగమ్మ ఆదివారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని బేగంపేట ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్ రావు తెలిపారు.
Also Read: మాస్కులు ధరించనందుకు 22 లక్షల మందికి జరిమానా.. 44 కోట్ల రూపాయలు వసూలు చేసిన బీఎంసీ..