AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP-TG Weather: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 5 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీకాకుళం సహా ఏపీలోని పలు జిల్లాలు, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు.

AP-TG Weather: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 5 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Jul 07, 2026 | 6:56 AM

Share

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వచ్చే ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలతోపాటు ఈదురుగాలులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవనప్పటికీ, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) సోమవారం వాతావరణ సూచన జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.

“తెలంగాణలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అక్కడక్కడా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది” అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జూలై 11 వరకు బలమైన గాలుల హెచ్చరికను జారీ చేసింది.

రాబోయే 48 గంటల పాటు, ఆదిలాబాద్, కుమరమ్ భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దాపల్లి, జయశంకర్ భూపాలపల్లి సహా పలు జిల్లాలకు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

ఏపీలో వర్షాలు..

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం (07-07-2026) శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ( APSDMA ) వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది.

Follow Us