Hyderabad Water Supply: హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

Hyderabad Water Supply: నగరంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి పంపింగ్ మెయిన్‌‌ జంక్షన్, గ్రావిటీ మెయిన్‌‌కు ఎంఎస్–పీఎస్సీ పైపుల అనుసంధాన, పెద్దాపూర్ క్యాంపస్‌‌లోని ఫేజ్–4 పంప్‌‌హౌస్‌‌లో వాల్వుల మార్పిడి పనులు..

Hyderabad Water Supply: హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌
Hyderabad Water Supply

Updated on: Aug 16, 2026 | 6:44 PM

Hyderabad water supply: హైదరాబాద్‌ వాసులకు నీటినీటి సరఫరా చాలా ముఖ్యం. ఎందుకంటే నగరంలో చాలా మంది రోజు విడిచి రోజు వచ్చే తాగునీటిపైనే ఆధారపడి ఉన్నారు. అయితే సోమవారం (ఆగస్ట్‌ 17) నగరంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి పంపింగ్ మెయిన్‌‌ జంక్షన్, గ్రావిటీ మెయిన్‌‌కు ఎంఎస్–పీఎస్సీ పైపుల అనుసంధాన, పెద్దాపూర్ క్యాంపస్‌‌లోని ఫేజ్–4 పంప్‌‌హౌస్‌‌లో వాల్వుల మార్పిడి పనులు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌ చేయనున్నట్లు మెట్రో వాటర్‌ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇవి సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు జరుగుతాయి. ఈ కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.

ఏయే ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌:

ట్రాన్స్‌‌మిషన్ డివిజన్–2 పరిధిలోని బీహెచ్​ఈఎల్​, ఎంఐజీఐ 1, 2, రైల్​విహార్, చందానగర్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, కేపీహెచ్‌బీ కాలనీ, షేక్‌‌పేట్, కోకాపేట్, మణికొండ, నార్సింగి, గాయత్రీనగర్, బోరబండ, ఈఎస్ఐ ప్రాంతాలకు నీటి సరఫరా బంద్‌ ​అవుతుందని పేర్కొన్నారు. అలాగే, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడ, అమీర్‌‌పేట్, వెంగళరావునగర్, సనత్‌‌నగర్, నిమ్స్, బంజారాహిల్స్, తట్టిఖానా, సోమాజీగూడ, బి.ఎస్.మక్తా, ఎం.ఎస్. మక్తా, కొండాపూర్, ఆదిత్యనగర్, ప్రేమ్‌‌నగర్, హఫీజ్‌‌పేట్, మయూరినగర్, గోకుల్ ప్లాట్స్, మలేషియన్ టౌన్‌‌షిప్, హైదర్‌‌నగర్, రెడ్డీస్ ల్యాబ్స్, కోకాకోలా, ఐడీఏ బొల్లారం తదితర ప్రాంతాల్లో లో ఫ్రెషర్స్‌తో సరఫరా ఉంటుందని వెల్లడించారు. నీటిని ఆదా చేయడం, అవసరమైన నీటిని ముందుగానే సేకరించడం చాలా ముఖ్యం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us