ఈ దొంగోడి వద్ద కేజీ బంగారం.. దొంగతనాల్లో మాములు తోపు కాదు

తాజాగా అతని పాపం పండింది. RGI పోలీసులు ఈ కేటగాడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఏకంగా కేజీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. 110 రోజుల వ్యవధిలో 200 సార్లు ఫ్లైట్స్‌లో ట్రావెల్ చేస్తే.. మహిళల నుంచి బంగారం కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి

ఈ దొంగోడి వద్ద కేజీ బంగారం.. దొంగతనాల్లో మాములు తోపు కాదు
Robbery
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Jun 15, 2024 | 8:33 PM

ఢిల్లీకి చెందిన ఈ దొంగోడు మాములోడు కాదు. చిన్న, చిన్న ఇళ్లల్లో దొంగతనాలు చేస్తే ఏం వస్తుంది.. అందుకే విమానాల్లో ప్రయాణించే మహిళలను టార్గెట్ చేయడం షురూ చేశాడు. కనెక్టివిటీ విమానాల్లో ట్రావెల్ చేస్తూ.. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి.. వారి గోల్డ్ ఆర్నమెంట్స్ కొట్టేస్తున్నాడు. తాజాగా అతని పాపం పండింది. RGI పోలీసులు ఈ కేటగాడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఏకంగా కేజీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. 110 రోజుల వ్యవధిలో 200 సార్లు ఫ్లైట్స్‌లో ట్రావెల్ చేస్తే.. మహిళల నుంచి బంగారం కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

ఢిల్లీకి చెందిన రాజేశ్‌ సింగ్ కపూర్ చాలా తెలివిగా దొంగతనాలు చేసేవాడు. ఫ్లైట్ ఎక్కకముందే ఒంటరి మహిళలను గమనిస్తాడు. ఫ్లైట్ ఎక్కే సమయంలో వారి వెంటే వెళ్లి.. సదరు మహిళ క్యాబిన్‌లో హ్యాండ్ బ్యాగ్ భద్రపరిచిన క్యాబిన్ పక్కనే సదరు నిందితుడు తన బ్యాగ్ పెడతాడు. మహిళలు వాష్‌ రూమ్‌కు వెళ్లిన సందర్భంలో ఆయా మహిళల బ్యాగుల నుంచి విలువైన వస్తువులు తీసుకొని తన బ్యాగులో వేసుకునేవాడు.

విమానం దిగి బయటకు వచ్చాక ఆ ఆభరణాలను… పాన్‌ బ్రోకర్లకు అమ్మేవాడు. ఆర్‌జీఐ పోలీస్‌స్టేషన్‌తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిందితుడిపై చాలా కేసులు నమోదయినట్లు డీసీపీ తెలిపారు. జల్సాలకు అలవాటుపడి.. ఈజీ మనీ కోసం నిందితుడు దొంగతనాల వైపు మళ్లాడని వివరించారు. నిందితుడికి సహకరించిన మరో వ్యక్తి గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అయితే, విమానాల్లో ప్రయాణించే సమయంలో మహిళలు అలెర్ట్‌గా ఉండాలని.. ఏవైనా విలువైన వస్తువులు ఉంటే బ్యాగులను తమతోనే ఉంచుకోవాలని సూచించారు.

అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..