KTR: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. ప్రధాని మోదీకి కేటీఆర్ లెటర్

|

Jun 09, 2022 | 8:15 PM

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏటా రెండు కోట్ల ప్రైవేటు...

KTR: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. ప్రధాని మోదీకి కేటీఆర్ లెటర్
Follow us on

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏటా రెండు కోట్ల ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని లేఖలో ప్రశ్నించారు. తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఇప్పటికే 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని.. మరో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని లేఖలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ఇతరులకు అమ్మడం వల్ల ఉద్యోగాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ యువతతో కలిసి టీఆర్ఎస్ తరఫున ఆందోళనలు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో తెలంగాణ ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుంటే కేంద్రం మాత్రం ఉద్యోగాల భర్తీని వదిలేసిందని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రధానిగా మోడీ విఫలమయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్ధానాలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయారు. అసమర్థ నిర్ణయాలు, ఆర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాకపోగా.. ఉన్నవి కూడా పోతున్నాయి. ప్రతి సంవత్సరం 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటలన్నీ నీటిమూటలుగా మిగిలిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు సహకారం అందిస్తున్న తెలంగాణకు మీరు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటి..? ఈ అంశాలపై తెలంగాణ యువతకు ఏం సమాధానం చెబుతారు.

– కేటీఆర్, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి