Osmania Hospital: ఉస్మానియా హాస్పిటల్‌లో ట్విన్‌ టవర్స్‌ నిర్మాణంపై ప్రభుత్వం మరో ముందడుగు

| Edited By: Subhash Goud

May 24, 2022 | 1:57 PM

Osmania Hospital: ఉస్మానియా హాస్పిటల్‌లో ట్విన్‌ టవర్స్‌ నిర్మాణంపై మరో ముందడుగు వేసింది ప్రభుత్వం. త్వరగా రిపోర్ట్‌ ఇవ్వాలని చీఫ్‌ ఇంజనీర్ల కమిటీని ఆదేశించింది. ..

Osmania Hospital: ఉస్మానియా హాస్పిటల్‌లో ట్విన్‌ టవర్స్‌ నిర్మాణంపై ప్రభుత్వం మరో ముందడుగు
Follow us on

Osmania Hospital: ఉస్మానియా హాస్పిటల్‌లో ట్విన్‌ టవర్స్‌ నిర్మాణంపై మరో ముందడుగు వేసింది ప్రభుత్వం. త్వరగా రిపోర్ట్‌ ఇవ్వాలని చీఫ్‌ ఇంజనీర్ల కమిటీని ఆదేశించింది. ఉస్మానియా హాస్పిటల్‌పై త్వరగా రిపోర్ట్‌ ఇవ్వాలని చీఫ్‌ ఇంజనీర్ల కమిటీని కోరింది కేబినెట్‌ సబ్‌ కమిటీ. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ఆదేశాలతో MCRHRDలో మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్ అలీ సమావేశమై చర్చించారు. ఈ సమావేశానికి ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీతోపాటు MLA అక్బరుద్దీన్‌ ఓవైసీ కూడా అటెండ్ అయ్యారు. ఉస్మానియా హాస్పిటల్‌ ప్రాంగణంలో కొత్త నిర్మాణాలు ఎలా చేపట్టాలో సూచనలు, సలహాలు సేకరించారు. చీఫ్‌ ఇంజనీర్ల కమిటీతో చర్చించి, అభిప్రాయాలు తీసుకున్నారు. హైకోర్టు డైరెక్షన్స్‌ మేరకు ప్రస్తుతమున్న హెరిటేజ్‌ బిల్డింగ్స్‌కు ఇబ్బంది లేకుండా కొత్త నిర్మాణాలు ఎలా చేపట్టాలో రిపోర్ట్‌ ఇవ్వాలని కోరారు.

ప్రస్తుతమున్న బిల్డింగ్స్‌ను టచ్‌ చేయకుండా అసలు కొత్త నిర్మాణాలు చేపట్టగలమో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. సేమ్‌ టైమ్‌, చీఫ్‌ ఇంజనీర్ల కమిటీకి పలు సూచనలు చేశారు మంత్రులు. చారిత్రాత్మకమైన ఉస్మానియా హాస్పిటల్‌ బిల్డింగ్స్‌ను కూల్చి, కొత్త నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో దానికి బ్రేక్‌ పడింది. పాత భవనాలను కూల్చకుండానే కొత్త నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు డైరెక్షన్స్‌ ఇవ్వడంతో చీఫ్‌ ఇంజనీర్ల కమిటీని నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతమున్న ఉస్మానియా హాస్పిటల్‌ ప్రాంగణంలో ట్విన్ టవర్స్‌ను నిర్మించాలనుకుంటోది. చీఫ్‌ ఇంజనీర్ల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందడుగు వేయనుంది సర్కార్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి