తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్‌ను కొట్టివేశారని అత్యున్నత న్యాయస్థానం చెప్పుకొచ్చింది. కాగా తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత విద్యా విభాగం మాజీ డైరక్టర్ వెలిచాల కొండలరావు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇంటర్ ఫలితాలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధం లేదని హైకోర్టు తీర్పును వెలువరించింది. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమేనని, కానీ ఇంటర్ ఫలితాలకు వారి ఆత్మహత్యలకు సంబంధం లేదనిహైకోర్టు తేల్చిన విషయం తెలిసిందే.