AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అయ్యో దేవుడా.. గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి..

సైలెంట్ కిల్లర్.. గుండె పోటు కేసులు నానాటికి పెరుగుతున్నాయి.. ఒకప్పుడు గుండె సమస్యలు కేవలం పెద్దవారికి మాత్రమే వచ్చేవి అనుకునేవారు.. కానీ, ఇప్పుడు కాలం మారింది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. గుండెపోటు అందరి ప్రాణాలు తీస్తుండటం.. ఆందోళన కలిగిస్తోంది.

Hyderabad: అయ్యో దేవుడా.. గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి..
Heart Attack
Shaik Madar Saheb
|

Updated on: Sep 08, 2025 | 8:26 AM

Share

సైలెంట్ కిల్లర్.. గుండె పోటు కేసులు నానాటికి పెరుగుతున్నాయి.. ఒకప్పుడు గుండె సమస్యలు కేవలం పెద్దవారికి మాత్రమే వచ్చేవి అనుకునేవారు.. కానీ, ఇప్పుడు కాలం మారింది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. గుండెపోటు అందరి ప్రాణాలు తీస్తోంది.. చిన్న వయస్సు వారు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.. అప్పటివరకు సంతోషంగా తమతో గడిపిన వారు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రస్తుతం ఆందోళనకరంగా మారాయి.. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో జరిగిన వినాయక నిమజ్జనంలో.. డీజే మ్యూజిక్ కు డ్యాన్స్ చేస్తూ శేఖర్ అనే వ్యక్తి డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు.. సీపీఆర్ చేసిన ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన మరువక ముందే.. ఓ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతి చెందాడు.. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరిలో జరిగింది.

ఘట్‌కేసర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ డేవిడ్‌ (31) మల్కాజిగిరి విష్ణుపురికాలనీలో నివాసం ఉంటున్నాడు.. గణేష్ నిమజ్జనోత్సవంలో భాగంగా ఆదివారం ఆనంద్‌బాగ్‌లో నృత్యం చేస్తూ డేవిడ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు డేవిడ్ ను పరిక్షించి చికిత్స అందించారు.

ఈ క్రమంలోనే.. అతని పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు డేవిడ్ ను కుటుంబసభ్యులు గాంధీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు డేవిడ్ అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, మూడు నెలల పాప ఉందని సీఐ సత్యనారాయణ తెలిపారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే