Hyderabad: భాగ్యనగరంలో కొత్త ట్రెండ్.. మసాజ్ ముసుగులో వ్యభిచారం.. మోడల్స్‌తో వల..

|

Apr 13, 2021 | 10:17 AM

Prostitution in madhapur: అక్కడ అంతా మంచిగానే ఉంటుంది.. మసాజ్ చేస్తామంటూ బయట బోర్డు పెడతారు.. లోపల నడిచే వ్యవహారం మాత్రం వేరు..

Hyderabad: భాగ్యనగరంలో కొత్త ట్రెండ్.. మసాజ్ ముసుగులో వ్యభిచారం.. మోడల్స్‌తో వల..
prostitution racket in hyderabad
Follow us on

Prostitution in madhapur: అక్కడ అంతా మంచిగానే ఉంటుంది.. మసాజ్ చేస్తామంటూ బయట బోర్డు పెడతారు.. లోపల నడిచే వ్యవహారం మాత్రం వేరు.. ఈ తరహా వ్యభిచారం ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా కొత్త ట్రెండ్‌గా మారింది. భాగ్యనగరం నడిబొడ్డున గుట్టుగా సాగుతున్న కొత్త తరహా వ్యభిచారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. మాదాపూర్‌లోని ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో రహస్యంగా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. మసాజ్ సెంటర్ పేరిట నిర్వహిస్తున్న హైటెక్ సెక్స్ రాకెట్‌ను యాంటీ ఉమెన్ ట్రాఫీకింగ్ టీం సోమవారం పట్టుకుంది. సమచారం మేరకు పోలీసులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రష్యాకు చెందిన ఇద్దరు యువతులు, ముంబై, పంజాబ్‌కు చెందిన ముగ్గురు యువతులను, ఒక విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా వెబ్‌సైట్ ద్వారా వ్యభిచార వ్యవహారం నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఈ దాడులు చేశారు.

అయితే వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారయ్యాడు. అయితే ఈ వ్యభిచారం పేరిట నిందితుడు చాలామంది నుంచి లక్షల్లో దండుకున్నట్లు సమచారం. కాగా.. ఈ వ్యభిచార వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉంది.. యువతులను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు.. ఇంకా ఎక్కడైనా ఇలాంటి వ్యవహారం నడుస్తుందా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల కాలంలో ఇదే తరహా సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతకు ముందు కూడా పోలీసులు పలు హోటళ్లపై దాడులు నిర్వహించి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read:

West Bengal election 2021: బెంగాల్‌లో ఉద్రిక్తంగానే పరిస్థితులు.. మళ్లీ పెద్ద ఎత్తున బాంబుల స్వాధీనం..

FD Frauds: ఇలా చేశారంటే మీ ఖాతాలో డబ్బులన్నీ మాయం.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న ఎస్‌బీఐ