మానవ మృగం శ్రీనివాస రెడ్డి అరాచకాలపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు ఇంకా ఎన్ని ఉన్నాయి అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ మృగాడికి ఎంతమంది బలయ్యారు అన్నకోణంలో విచారణ సాగిస్తున్నారు.
మరో వైపు.. వ్యవసాయ బావిలో పూడ్చి పెట్టిన ఇద్దరు బాలికల శాస్త్రీయ ఆధారాల కోసం మృతుల కుటుంబాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది భువనిగిరి కోర్టు. ఇందుకోసం మృతుల కుటుంబ సభ్యులను హజీపూర్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. శ్రీనివాస్ రెడ్డిని కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. దీనిపై ఇవాళ నల్గొండ కోర్టు విచారణ చేపట్టనుంది. శ్రీనివాస్ రెడ్డిని కస్టడీకి అప్పగిస్తే.. మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. శ్రీనివాస్ రెడ్డిలో ఇంతగా నేర ప్రవృత్తి పెరగడానికి కారణమేంటి..? ఇంకా శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఎంతమంది బలయ్యారు..? వంటి వివరాలు రాబట్టే అవకాశం ఉంటుందని తెలిపారు పోలీసులు.
అయితే.. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటున్నారనే సమాచారం పోలీసులకు చిక్కలేదు. తాజాగా.. అతని కుటుంబసభ్యులకు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎలాగైనా.. శ్రీనివాస్ రెడ్డికి తప్పకుండా ఉరిశిక్ష పడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.