Hyderabad: కీర్తి సురేశ్ ఫొటోను డీపీగా పెట్టి.. అందినకాడికి దోచేసింది.. పోలీసుల ఎంట్రీతో..

|

Dec 03, 2022 | 1:51 PM

సోషల్ మీడియా వినియోగం అధికమైంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పలువురు మోసాలకు గురవుతున్నారు. అట్రాక్ట్ చేసే ఓ ఫొటో.. నాలుగు మంరచి మాటలు.. నిలువునా ముంచేస్తున్నాయి. ఏమరు పాటుగా ఉంటే అందినకాడికి..

Hyderabad: కీర్తి సురేశ్ ఫొటోను డీపీగా పెట్టి.. అందినకాడికి దోచేసింది.. పోలీసుల ఎంట్రీతో..
Cyber Fraud
Follow us on

సోషల్ మీడియా వినియోగం అధికమైంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పలువురు మోసాలకు గురవుతున్నారు. అట్రాక్ట్ చేసే ఓ ఫొటో.. నాలుగు మంరచి మాటలు.. నిలువునా ముంచేస్తున్నాయి. ఏమరు పాటుగా ఉంటే అందినకాడికి దండుకుంటున్నాయి. ఎదుటివారి బలహీనతలను ఆసరాగా చేసుకుని పలువురు జేబులు నింపుకుంటున్నారు. స్నేహం ముసుగులో చేస్తున్న ఈ తరహా నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువతనే కాదు..వయసుమళ్లిన వాళ్లనూ ప్రమాదంలో పడేస్తున్నాయి. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు కేటుగాళ్లు. అమాయకులను బురిడీ కొట్టించి ఓవర్‌ నైట్‌లో లక్షలు సంపాదించాలనేది ప్లాన్ తో చివరకు కటకటాల పాలవుతున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే జరిగింది.

అందమైన హీరోయిన్స్‌ ఫొటోను డీపీ గా పెట్టుకొని భర్తతో కలిసి మోసాలకు పాల్పడింది ఓ మహిళ. ఆమెను నమ్మి.. లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు. కర్ణాటకకు చెందిన మంజుల దంపతులు.. ఫేస్‌బుక్‌లో హీరోయిన్‌ ప్రొఫైల్‌ పిక్‌తో అకౌంట్ ఓపెన్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన పరమేశ్వర్‌తో చాటింగ్ చేశారు.

Hyderabad Cyber Cirme

అత్యవసర ఖర్చుల కోసమని తరచూ డబ్బులు అడిగి తీసుకున్నారు. లక్షల్లో నగదు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. పోలీసులకు పిర్యాదు చేయడంతో దంపతుల చీటింగ్‌ వ్యవహారం వెలుగులోకొచ్చింది. దీంతో విచారణ జరిపిన పోలీసులు.. హసన్ జిల్లా దాసర్ హళ్లిలో మంజులను అరెస్ట్‌ చేశారు. ఆమె భర్త పరారీలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలగాణ వార్తల కోసం