MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి నోటీసులు.. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ..

|

Dec 06, 2022 | 9:46 PM

పీడీ యాక్ట్ కేసులో అరెస్టై.. ఇటీవల బెయిల్‌పై విడుదలైన గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైదరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి నోటీసులు.. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ..
Raja Singh
Follow us on

పీడీ యాక్ట్ కేసులో అరెస్టై.. ఇటీవల బెయిల్‌పై విడుదలైన గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైదరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌కి రాజాసింగ్ కామెంట్ చేయడంతో మంగళహాట్ పోలీసులు మంగళవారం రాత్రి నోటీసులు జారీ చేశారు. కోర్టు ఆదేశాలు పాటించకుండా.. ఓ సామాజిక వర్గంపై రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని.. దీనికి 2 రోజుల్లోగా రాజాసింగ్‌ వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు.

కాగా, రాజాసింగ్ మత విద్వేశాలను రెచ్చే గొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయనపై ఆగస్టు 25న పీడీయాక్ట్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. బీజేపీ జాతీయ క్రమశిక్షణ సైతం రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ విధించింది. ఈ క్రమంలో దాదాపు 40 రోజుల తర్వాత నవంబర్ 9న బీజేపీ నేత గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెయిల్‌ లభించింది. భవిష్యత్తులో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్ట్‌ రాజాసింగ్‌కు షరతులు విధించింది.

ఈ క్రమంలో తాజాగా.. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులివ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజాసింగ్ స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..